Categories: FeaturedHealth News

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలంటే.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి..?

వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు చుట్టుముడుతాయి. నీళ్లు మారడం, వాతావరణం మారడం… ఇలా కారణం ఏదైనా కావొచ్చు… చాలామంది అనారోగ్యం బారిన పడుతుంటారు. పరిసరాలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. లేదంటే దోమలు చేరి కొత్త వ్యాధులకు దారి తీస్తాయి. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో కూడా తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ ఒక్కటి తింటే వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

అయితే ఈ కాలంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
స్నేహితులు అయినా.. కుటుంబసభ్యులు అయినా బయట చల్లని వర్షం పడుతుంటే.. ఇంట్లో వేడి వేడి చాయ్ లేదా బజ్జీలు, పకోడి లాంటివి తినాలని అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి ఆహారపదర్ధాలు తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా నూనెలో ఉంటాయి. దీంతో జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అల్ల నేరేడు, ఆల్ బుకారా, చెర్రీలు, దానిమ్మ పండ్లు వంటి వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.

ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఈ పండ్లను తీసుకునేటప్పుడు కట్ చేసి పక్కన పెట్టడం ఆ తర్వాత తినడం కంటే ఒకేసారి పండును పూర్తిగా తినడం మంచిది. సాధారణంగా అన్నం తిన్న తర్వాత చివరగా పెరుగుతో అన్నం తినడం చాలామందికి అలవాటు. అయితే ఈ పెరుగు జీర్ణ శక్తిని పెంచుతూ.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపులోని హానికారకమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అందువల్ల పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలని అనిపిస్తే నూనెలో ఎక్కువగా ఉండే వాటిని కాకుండా.. సూప్ లాంటివి తీసుకోవడం మంచిది.

చాయ్ తాగాలనిపిస్తే అల్లం టీ తాగడం మంచిది. ఇది వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అందుకే వర్షాకాలంలో అల్లం టీ తాగేందుకు ప్రయత్నించాలి. చేదు అనేది మన శరీర ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే వర్షాకాలంలో కాకరకాయ కూర, మెంతులు, వేపాకు, పసుపు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే.. వాల్ నట్స్, పిస్తా పప్పు, అవిసె గింజలు లాంటివి కూడా తింటే.. ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా .. ఇమ్యూనిటీని పెంచుతాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago