ఎల్ఐసీ వివిధ వర్గాల వారికి ప్రత్యేకమైన పాలసీలను తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది. దీనిలో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు ప్రతీ నెల అకౌంట్ లో డబ్బుల పొందొచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గతేడాది ‘న్యూ జీవన్ శాంతి’ పాలసీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ పాలసీ. ఈ పాలసీలో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రతీ నెల డబ్బులు మన అకౌంట్లోకి వస్తాయి. అందుకే సింగిల్ ప్రీమియం పాలసీ అన్నారు.
దీనిలో కనీసం రూ.1.50 లక్షలు చెల్లించాలి. దీనికి గరిష్టంగా ఇంత కట్టాలి అనే రూల్ లేదు. ఎంతైనా ప్రీమియం కొట్టొచ్చు. కనీస వయస్సు మాత్రం 30 ఏళ్లు నిండి.. గరిష్టంగా 79 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఇలా చెల్లించిన వారికి నెలకు రూ.1000 చొప్పును యాన్యూటీ లభిస్తుంది. ఈ పాలసీ తీసుకునే సమయంలో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో మెచ్యూరిటీ తీరినప్పుడు కూడా అలానే ఉంటాయి.
ఎల్ఐసీ ఏజెంట్ దగ్గర కానీ.. లేదా ఆన్ లైన్ లో కానీ ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం చెల్లించిన తర్వాత అవసరమైనప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు. ఓ వ్యక్తి ఈ పాలసీని రూ.10 లక్షలతో తీసుకుంటే.. అతడికి నెలకు రూ.7,952 డబ్బులు వస్తాయి. డిఫర్‌మెంట్ పీరియడ్ 12 ఏళ్లు ఎంచుకున్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. అంటే ఏడాదికి రూ.99,400 లభిస్తాయి. అయితే వాటికి వడ్డీ అనేది అదనంగా జమ అవుతూ ఉంటుంది.
































