Categories: FeaturedMovie News

Karthika Deepam: దీప కాపురాన్ని నాశనం చేస్తున్న డైరెక్టర్.. మోనిత వీరప్రేమికురాలు అంటూ అబద్దాలు చెప్తూ?

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. మోనిత చనిపోలేదన్న నిజం ఎప్పుడు తెలుస్తుందో అని ప్రేక్షకులు బాగా ఆసక్తిగా చూస్తున్నారు. రేటింగ్ కూడా మొదటి స్థానం లోనే ఉంటుంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం. కార్తీక్ తో రత్నసీత ఇవాళ ఓ కొత్తమ్మాయి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి మోనిత పోలీస్ స్టేషన్ కు టీ పట్టుకుని వస్తుంది. అదే సమయంలో దీప కూడా వచ్చి మోనిత కనిపించిందని జరిగిన విషయాన్ని కార్తీక్ తో చెబుతుంది.

కార్తీక్ దీప మాటలను నమ్మలేకపోయాడు. మోనిత పక్కన ముసుగు వేసుకొని వీరి మాటలు వింటుంది. దీప మాత్రం మోనిత బతికే ఉందని, ఎలాగైనా పట్టుకుని వస్తాను అంటూ అనడంతో కార్తీక్ తన ఆవేశాన్ని ఓదార్చుతాడు. ఆలోచించుకోమని సలహా ఇస్తాడు.

వాళ్లు మాట్లాడుతుండగా మోనిత టీ ఇవ్వడానికి కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్ దీపకు ఇవ్వమంటాడు. అంతలోనే టీ గ్లాస్ జారిపడుతుంది. ఇక అక్కడికి పోలీస్ రావడంతో మోనితను ఎవరు అని అడిగేసరికి.. ఆమె మాట్లాడలేదని మూగ అమ్మాయని.. రత్నసీత పంపించిందని చెబుతాడు.

ఇక కార్తీక్ ను చూసుకుంటూ కార్తీక్ కు టీ ఇస్తుంది. కార్తీక్ ను అలాగే చూస్తూ ఉండిపోతుంది. టీ గ్లాస్ తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుండగా.. పోలీస్ ఆపి పగిలిన గ్లాస్ ముక్కలను తీయమంటాడు. ఇక మోనితకు గాజు ముక్క కాలికి గుచ్చుకోవడం తో అమ్మ అని అరిచి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

వెంటనే కార్తీక్ కు ఆమె మూగ అమ్మాయి అని.. కానీ అమ్మ అని అరిచింది అని అనడంతో ఆ విషయాన్ని దీపకు చెబుతాడు. దీప ఆమె మూగ అమ్మాయని అనేసరికి.. వెంటనే కార్తీక్ కు తనకు టీ ఇచ్చిన సమయంలో ఆ స్పర్శను, తన పర్సనాలిటీని చూసి మోనితనే అనుకుంటాడు.

ఆలోచనలో ఉన్న కార్తీక్ ను చూసి దీప ప్రశ్నించగా.. మోనిత అనే విషయాన్ని చెబితే వెంటనే వెళ్తుందని.. పోలీస్ స్టేషన్ లోకే అడుగు పెట్టిన మోనిత.. దీపను బతుకనిస్తుందా అనుకుంటూ దీపతో చెప్పలేకపోతాడు. వెంటనే రోషిణికి చెప్పాలనుకుంటాడు.

ఇక హాస్పిటల్ కి వెళ్ళిన రోషిణి మోనిత ఫోటోను చూసి గతంలో మోనిత మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అక్కడ ఉన్న డాక్టర్ ను మోనిత, కార్తీక్ ల మధ్య ఉన్న బంధం గురించి అడుగుతుంది.ఆ డాక్టర్ కూడా మోనితకు సపోర్ట్ గా మాట్లాడుతుంది.

కానీ రోషిణి మోనితది కృత్రిమ గర్భమని విన్నాను మరి ఈ విషయం నిజమే అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆ డాక్టర్ కూడా నిజమే అని ఎందుకంటే వాళ్ల మధ్య స్నేహం పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిందని అందుకే ఇలా చేసిందని అంటుంది.

కార్తీక్ ప్రేమ కోసమే ఇలా చేసిందని డాక్టర్.. రోషిణితో చెబుతుంది. అక్కడున్న ఒక పర్మినెంట్ ఉద్యోగిని పిలిపించి తనను ఎంక్వయిరీ చేస్తుంది. ఆమె కూడా మోనితకు సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతుంది. ఇక రోషిణి మోనిత ఫోటోను ఫోన్ లో తీసుకొని వెళుతుంది.

మరోవైపు సౌందర్య ఫోన్ మాట్లాడుతుండగా పిల్లలిద్దరూ తన తల్లి కోసం ఎదురుచూస్తారు. పిల్లల దగ్గరికి వెళ్లి ఏమైంది అని ప్రశ్నించగా పిల్లలు మళ్లీ తమ మాటలతో కోపం వచ్చేలా మాట్లాడుతుండగా.. సౌందర్య వెంటనే వాళ్లను బెదిరిస్తుంది.

ఇక తర్వాత ఎపిసోడ్ లో దీప ఆటోలో వెళుతూ మోనితను ఎలాగైనా వెతకాలి అని అనుకుంటుంది. మోనిత కూడా ఈరోజు రాత్రికే ఏదైనా చెయ్యాలి అని రత్న సీతతో అంటుంది. ఇక రోషిణి కార్తీక్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago