సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరో హీరోయిన్లు వస్తుంటారు వెళుతుంటారు. అయితే కొందరు మాత్రం నటించినది కొన్ని సినిమాలలో అయినప్పటికీ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుని ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో మీరా జాస్మిన్ ఒకరు.
పెద్ద పెద్ద కళ్ళతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఇండస్ట్రీ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. తమిళం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన మీరాజాస్మిన్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైపోయారు.
ఈ విధంగా తెలుగులోకి “రన్ ” సినిమా ద్వారా పరిచయమైన ఈమె భద్ర,అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, పందెంకోడి వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.ఈ విధంగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే మీరాజాస్మిన్ 2014వ సంవత్సరంలో అనిల్ జాన్ టైటాన్ అనే ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయ్యారు.
ఈ విధంగా కొద్దిరోజులపాటు ఈమె వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిచినప్పటికీ తన భర్త నుంచి పలు మనస్పర్ధలు విభేదాలు రావడంతో తన భర్త నుంచి దూరమయ్యారు. ఈ క్రమంలోనే తిరిగి తన దృష్టి మొత్తం ఇండస్ట్రీ వైపు మళ్ళించారు.
తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమె తన శరీరంపై దృష్టి పెట్టి ఎక్కువ వర్కౌట్ చేస్తూ బాగా సన్నబడ్డారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…