గత కొన్ని నెలల నుంచి అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుల్లితెర ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ప్రేక్షకుల కోసం బిగ్ బాస్ నిర్వాహకులు శుభవార్తను తెలియజేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
బిగ్ బాస్ కార్యక్రమం సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 10 గంటలకు,శని ఆది వారాలలో ఈ కార్యక్రమం 9గంటలకు ప్రసారం కాబోతుందని నిర్వాహకులు అధికారికంగా తెలియజేశారు.
బిగ్ బాస్ 5వ తేదీ ప్రసారం కాబోతుందనే వార్త అధికారకంగా ప్రకటించడంతో మరి ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ఎవరు అనే విషయంపై కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ వివరాలను కూడా తెలియజేస్తూ వారందరూ రేపటి నుంచి క్వారంటైన్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సీజన్ లో పాల్గొని కంటెస్టెంట్ లో ఎవరు అనే విషయానికి వస్తే..
యాంకర్ రవి, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ జె కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, కమెడియన్ లోబో, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జస్వంత్, సిరి హనుమంత, సీనియర్ నటి ప్రియా, సెవెన్ ఆర్ట్స్ సరయు, సీరియల్ ఆర్టిస్ట్ మానస్ షా, మోడల్ జస్వంత్, టీవీ నటుడు సన్నీ, కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఈ సీజన్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం సెప్టెంబర్ 5న ప్రారంభం కాబోతుందనే విషయాన్ని స్టార్ మా ఇన్స్టాగ్రామ్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…