ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆరేళ్ల వయస్సున్న ఆడపిల్ల నుంచి ఆరవై ఏళ్ల వయస్సున్న వృద్ధురాలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా జరిగిన ఘటన సమాజం ఎటుపోతుందా అన్న సందేహం కలుగకమానదు.
ఇంటి బయట మిగతా పిల్లలతో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని.. 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామ పరిధిలోని పెద్ద తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దతండాకు చెందిన దంపతులకు ఆరేళ్ల కూతురు ఉంది. కూలీ పనులకు వెళ్లిన వాళ్లు ఆ పాపను ఇంట్లో వదిలేసి వెళ్లారు.
చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్న ఆ పాపపై పక్కనే ఉన్న 60 ఏళ్ల వయస్సున్న చిన్నారిపై దీప్లానాయక్ కన్ను పడింది. చాక్లెట్ కొనిస్తానంటూ.. ఆ పాపను ఇంట్లోకి తీసుకెళ్లాడు. తలుపులు వేసి ఘోరానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన పాప తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. ఆ పాపతో ఆడుకున్న వారిని అడిగారు. వాళ్లు పక్కనే ఉన్న తాత వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడని చెప్పారు.
దీంతో ఆ ఇంటికి వెళ్లి చూడగా.. ఆ బాలిక వివస్త్రగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే అతడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…