మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మొదటి నుంచి వింటూనే ఉన్నాం.. ప్రభుత్వం కూడా కొన్ని ప్రకటనల ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అయినా మందుబాబులకు అవి చెవిన పడవు కదా.. చుక్క వేయనిదే.. ముద్ద దిగదు కొందరికి.
ఇదిలా ఉండగా.. కొన్ని అధ్యయనాల ప్రకారం బీర్ తాగడం మంచిదే అని వెల్లడించారు. కానీ ఎక్కువగా తాగితే మాత్రం ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే అని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. ఒక్క బీర్ విషయంలోనే కాదు.. ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఆరోగ్యానకి ఎలాంటి హాని ఉండదు. బీర్ ను రోజుకు 350 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకూడదని కూడా సూచిస్తున్నారు.
అయితే వీటి వల్ల ప్రయోజనాలను తెలుసుకుందాం.. ముఖ్యంగా అలసట, ఒత్తిడి, భయం లాంటివి ఎక్కువగా ఉండవట. అంతేకాదు.. రోజూ మితంగా బీరు తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బీర్ లో కూడా ఫైబర్ ఉంటుందట.. దీని వల్ల కొవ్వును కరిగించి లావు కాకుండా చూస్తుందట.
బీర్ లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో వ్యాధులు రాకుండా దూరం చేస్తుంది. చర్మ వ్యాధులు రాకుండా.. శరీరంపై గాయాలను వేగంగా నయం చేస్తుందని అధ్యయనం ప్రకారం వెల్లడించారు. బీరులో ఉన్న సిలికాన్ ఎముకలను బలపరుస్తుందట. ఎముకలు బలంగా తయారు కావడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందని పలు అధ్యయనాల ప్రకారం వెల్లడైంది. కనుక మితంగా బీర్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…