ప్రకృతిలో దొరికే కొన్ని మూలికల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవి మనకు తెలియకపోవడంతో వాటిని ఎక్కువగా పట్టించుకోము. ఆయుర్వేదంలో ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏంటంటే.. మిస్లి లేదా అశ్వగంధ మూలికల గురించి. దీనిని ఆయుర్వేద ఔషదాలల్లో ఉపయోగిస్తారు. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది ఒక పురాతన మూలిక. సంతానం లేని వారికి సంతానోత్పత్తిని కలిగించే దీనిని దివ్యౌషధంగా భావిస్తారు.
మన శరీరంలో ఉండే ఒత్తిడిని తరిమేయడంతో పాటు మనస్సును ప్రశాంతంగా కూడా ఉంచుతుందట. పురుషుల్లో ఇది స్పెర్మ్ కౌంట్ పెంచగలదట. ముఖ్యంగా ఇది మహిళల్లో వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుందట. చర్మసౌందర్యాన్ని పెంచడంతో పాటు ముఖాన్ని అందంగా చేయడంలో తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ స్థాయిలు తగ్గుదలను పెంచడంలో కూడా సహాయపడుతుందన్నారు. శుక్రకణాల సంఖ్యను పెంచడంతో పాటు.. అలసటను కూడా దూరం చేస్తుంది. అశ్వగంధలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. కొంతమందికి మూత్రంలో మంట వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా వాటికి పరిష్కారం లభించదు. దానికి శాశ్వత పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటే… అలాంటి వారు అశ్వగంధను వాడొచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీర నిర్మాణం, కండరాల్లో బలం పెంచడంలో అశ్వగంధకు మంచి పేరుంది. మగవారు రోజుకు 750mg చొప్పున 30 రోజులు తీసుకుంటే కండరాలు బలంగా తయారు అవుతాయి. వీటిని వాడే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం అనేది మంచిది.
తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్‌లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…