బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారటంతో ఏం జరుగుతుందో అని ప్రేక్షకులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సీరియల్ ను సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఇక రేటింగ్ కూడా మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. టీ ఇచ్చిన అమ్మాయి మోనితే అని కనిపెట్టిన కార్తీక్. ఇక ఈ విషయాన్ని దీపకు చెప్పకుండా తనలోనే ఉంచుకుంటాడు. పిల్లలు తన తల్లి కోసం ఎదురుచూస్తున్న సమయంలో సౌందర్య వచ్చి ప్రశ్నిస్తుంది.
ఇక పిల్లలు మళ్లీ తమ మాటలతో సౌందర్య మనసును నొప్పస్తారు. తన తల్లి దీప గురించి వ్యతిరేకంగా మాట్లాడటంతో.. నా కోడలు గురించి మీకు తెలియదు అంటూ వారిపై కోపం గా అరుస్తుంది సౌందర్య. దీప గురించి అలా మాట్లాడకండి అంటూ దీప గురించి చెబుతుంది.
సౌర్య వెంటనే సౌందర్యతో నాన్న దగ్గరికి అమ్మ తప్ప మరెవరు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్న సమయంలో.. పక్కనే ఉన్న హిమ ఒకటి గమనించావా సౌర్య అంటూ మోనిత కనిపించడం లేదు ఏంటి అంటుంది.
సౌర్య వెంటనే సౌందర్యతో నాన్న దగ్గరికి అమ్మ తప్ప మరెవరు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్న సమయంలో.. పక్కనే ఉన్న హిమ ఒకటి గమనించావా సౌర్య అంటూ మోనిత కనిపించడం లేదు ఏంటి అంటుంది.
ఎప్పుడు నాన్న కోసమే వచ్చే మోనిత.. ఇప్పుడు జైల్లో ఉన్న కూడా రావట్లేదు ఏంటి అనేసరికి.. వెంటనే సౌందర్య మోనిత నాన్నను చూడ్డానికి వెళ్ళింది అంటూ అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది.
ఇక దీప ఆటోలో వెళ్తూ మోనిత కనిపించిన విషయాన్ని తలుచుకుంటుంది. ఎవరూ నమ్మడం లేదు అనుకుంటూ.. ఇదంతా భ్రమనా అని అనుకుంటుంది. ఒకవేళ మోనిత బ్రతికే ఉన్నట్లయితే వెంటనే పట్టుకొనితీరుతా అనుకుంటుంది.
మరోవైపు మోనిత.. కార్తీక్ అక్కడ అలా ఉంటే నేను ఇక్కడ లగ్జరీగా ఉండలేను అంటూ రత్న సీతతో చెబుతుంది. కార్తీక్ కోసం చావకుండా ఎంత రిస్క్ అయినా చేస్తా అంటూ మాట్లాడుతుంది.ఇక ఏం జరిగిన ఈ రాత్రికే జరుగుతుందని మరో ప్లాన్ ను రత్నసీత కు చెబుతుంది.
దీప తులసి ఇంటికి వెళ్లి మాట్లాడుతుంది. ఇక జరిగిన విషయం తెలిసింది అంటూ తులసి అనగా.. మోనిత బ్రతికే ఉంది అని తులసితో అంటుంది. తనకు గుడిలో జరిగిన విషయాన్ని చెబుతుంది. కానీ తులసి కూడా నమ్మలేకపోతుంది.
ఇక తులసి.. దీప గతాన్ని మాట్లాడగా.. దీప చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది. మోనిత కనిపించిన విషయాన్ని ఎవరు ఎందుకు నమ్మడం లేదో అంటూ ఏడుస్తుంది. ఇక నేనే డాక్టర్ బాబు కాపాడుకుంటా అంటూ అక్కడనుండి వెళ్తుంది.
భాగ్యం ఇంట్లో దేవుడి ముందు నిల్చొని తన గతాన్ని తలుచుకుంటూ మంచి మనిషిగా మారాను అనుకుంటుంది. నా వల్ల ఇదంతా జరిగింది అంటూ ఎలాగైనా వాళ్ళ కాపురం చక్కపడాలి అంటూ దేవుడిని కోరుకుంటుంది.
ఇక కార్తీక్.. రోషిణి దగ్గరికి వెళ్లి మోనిత ఎక్కడ ఉందో చెబుతాను అంటూ మోనిత బ్రతికే ఉంది అంటూ.. ఇందాకే ఇక్కడికి వచ్చింది అంటూ జరిగిన విషయాన్ని చెబుతాడు. కానీ రోషిణి మాత్రం నమ్మకుండా కార్తీక్ పై అరుస్తుంది. ఇదంతా ప్లాన్ చేసారు అన్నట్లుగా మాట్లాడుతుంది.
కానీ కార్తీక్ మాత్రం ఇదంతా నిజమే అన్నట్లు మాట్లాడిన కూడా రోషిణి అరుస్తూ.. ఇలాంటి కట్టుకథలు అల్లకూడదు అంటూ.. మీరు అంత గొప్ప వ్యక్తి అయితే దీపను ఎందుకు దూరం ఉంచావు అని ప్రశ్నిస్తుంది. వెంటనే కార్తీక్ మోనిత వల్లే అంటూ గట్టిగా అరవడంతో రోషిణి షాక్ అవుతూ చూస్తుంది.
ఇక దీప సౌర్య దగ్గరికి వెళ్లి నాన్న వస్తాడు అని అనగా.. మళ్లీ అబద్దాలు చెప్పకు అమ్మ అని అనడంతో దీప బాధపడుతుంది. ఇక జైల్లో కార్తీక్ కడుపు నొప్పి అంటూ కడుపుని పట్టుకొని బాధపడుతుంటాడు. వెంటనే రత్న సీత బయటికి తీసుకురావాలని అనుకుంటుంది. మోనిత ఏదో ప్లాన్ చేసుకుంటూ బయలుదేరినట్టు కనిపిస్తుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…