సినీ ఇండస్ట్రీలో నటీనటులకు అంత పాపులరిటీ రావడానికి కారణం వాళ్లను ఆదరించే అభిమానులు మాత్రమే. అభిమానులు, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే నటీనటులకు అంత క్రేజ్ ఉండేది కాదు. అయితే టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన విజయశాంతి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే ఓ రోజు ఆమెకు బెంగుళూరు అభిమాని నుంచి ఓ విచిత్రమైన ఉత్తరం వచ్చింది. అందులో ఏముందంటే.. ప్రియమైన విజయశాంతి గారికి అంటూ రాశాడు ఆ అభిమాని. తాను సీఏ చదువుతున్నానని.. తనకు స్త్రీలతో స్నేహం చెయ్యడం అంటే ఎంతో ఇష్టమని.. వారి ద్వారా కలిగే ప్రేరణతో ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉందంటూ రాసుకొచ్చాడు.
తనకు ఓ స్నేహితురాలు ఉందని.. ఆమె కూడా సీఏ చదువుతున్నారాని.. ఆమె ఇచ్చిన ప్రేరణతో ఇద్దరం పోటీ పడి చదువుతున్నానమని ఉత్తరంలో రాశాడు. అయితే ఆమె కంటే ఎక్కువ మార్కులు రావాలంటే ఈ ఉత్తరానికి రిప్లైగా ఒక ఫొటో పంపిస్తే సరిపోతుందంటూ వేడుకున్నాడు. ఈ ఉత్తరానికి మీరు సమాధానం ఇస్తే.. తాను కష్టపడి చదివి సీఏ పాసై, విదేశాలకు వెళ్లడానికి సహాయపడిన వాళ్లు అవుతారంటూ రాశాడు.
ఇట్లు మీ ప్రియాతి ప్రియమైన అభిమాని అంటూ ముగించాడు ఆ బెంగళూరు అభిమాని. విజయశాంతిపై అతడికి ఉన్న అభిమానానికి ఆమె ఎంతో ఆనందించారట. అయితే తనకు రిప్లై గా ఫొటో పంపించడంతో పాటు ఆల్ ది బెస్ట్ అంటూ సమాధానం కూడా ఇచ్చినట్లు తెలిసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…