బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారడంతో ప్రేక్షకులు కూడా ఈ సీరియల్ ను అసలు వదలడం లేదు. అంతేకాకుండా రేటింగ్ కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. కార్తీక్ రోషిణి దగ్గరికి వచ్చి మోనిత బతికే ఉందన్న విషయాన్ని చెప్పేసరికి ఇటువంటి కట్టు కథలు చెప్పకండి అంటూ కార్తీక్ పై ఫైర్ అవుతుంది. మీరు అంత జెంటిల్మెన్ అయితే మీ భార్యను ఎందుకు దూరం పెట్టారని ప్రశ్నిస్తుంది.
వెంటనే కార్తీక్ కోపంతో మోనిత వల్లే అంటూ అరుస్తాడు. మోనిత క్రిమినల్ అని గట్టిగా అనడంతో.. ఆ క్రిమినల్ ను ఎందుకు చంపారు అంటూ.. ఎక్కడ ఉందో అని చెప్పు అంటుంది. కార్తీక్ కూడా తను హత్య చేయలేదన్న విషయాన్ని గట్టిగా చెబుతాడు.
ఇక శ్రావ్య.. ఆదిత్య దగ్గరికి వచ్చి కార్తీక్ ని ఎందుకు చూడటం లేదు అంటూ గట్టిగా అరుస్తుంది. ఫ్రెండ్స్ తో గంటలకొద్దీ మాట్లాడుతావు అంటూ అంతేకానీ అన్నయ్య దగ్గరికి వెళ్లడానికి టైం లేదా అంటూ కోపంతో మాట్లాడుతుంది.
శ్రావ్య మాట్లాడిన మాటలకు ఆదిత్య అందరిపై బాగా ఫైర్ అవుతాడు. అన్నయ్య జీవితాన్ని మనమే ఇలా చేశాము అంటూ అనేసరికి సౌందర్య కోపంతో రగిలిపోయి అలా అంటున్నావ్ ఏంటి అని ప్రశ్నిస్తుంది.
దీప వారణాసి ఆటోలో మోనిత ఇంటికి వెళుతుంది. అక్కడున్న వాళ్ళని మోనిత గురించి అడిగేసరికి మోనితను చనిపోయిందని అనుకుంటుంది. తనకు మోనిత కనిపించడం భ్రమ అని అనుకుంటుంది.
సౌందర్య, ఆనందరావు ఆదిత్య అన్న మాటలను తలుచుకుంటారు. అంతలోనే హిమ వచ్చి సౌర్య కు జ్వరం వచ్చింది అంటూ కంగారు పడుతూ చెబుతుంది. సౌర్య దగ్గరికి వెళ్లగా నాన్న కావాలి అంటూ నాన్న వస్తేనే జ్వరం తగ్గుతుంది అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
మొత్తానికి సౌర్య తన తండ్రి కోసం బెంగ పడుతూ తన తల్లిని ఆవిడ ఏది అని అనేసరికి వెంటనే సౌందర్య ఎవరు అని ప్రశ్నించగా.. వంటలక్క అనేసరికి సౌందర్య బాధపడుతూ దీప పడిన బాధల గురించి, దీపను బాధను పెట్టిన వాళ్ల గురించి మాట్లాడుతుంది.
తరువాయి భాగంలో ఇక దీప సౌర్య కు టాబ్లెట్లు ఇస్తున్న సమయంలో.. నాన్న వస్తారని అంటుంది. వెంటనే శౌర్య అబద్ధం చెప్పకు అమ్మ అంటూ నీ మీద ఇష్టం పోయింది అంటూ అనేసరికి దీప బాధపడుతుంది.
ఇక జైల్లో కార్తీక్ కడుపు నొప్పితో బాధ పడగా రత్న సీత కార్తీక్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మోనిత ఇదంతా నా వల్లే కార్తీక్ అంటూ ముఖానికి చున్ని అడ్డు కట్టుకొని బయలుదేరినట్లు కనిపిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…