Movie News

మంచు విష్ణుపై కోట శ్రీనివాసరావు ఫైర్.. కృష్ణ, చిరంజీవి దగ్గర డబ్బుల లేవా? బిల్డింగ్ కట్టిస్తే నువ్వెళ్ళి ఉంటావా?

సినీ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా అపోహలు, గాసిప్ లు అనేవి పుడుతూనే ఉంటాయి. వాడు ఇలా.. వీడు అలా అంటూ మన స్నేహితులు కూడా మాట్లాడుతుంటారు. అయితే సినిమాలో ఈ గాసిప్ లు, అపోహలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనిపై కోట శ్రీనివాసరావు ఇలా స్పందించారు. అపోహల గురించి మీరు నమ్ముతారా.. మీకు ఎప్పైడైనా అనుభవం అయిందా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అతడు ఇలా సమాధానం ఇచ్చారు. ఎన్నో అపోహలను, గాసిప్ లు విన్నానని అన్నారు. అయిన తనకు అవకాశాలు ఏనాడు పోలేదని.. తనకు ఉన్న ట్యాలెంట్ తోనే ముందుకుసాగానని అన్నారు.

తన దగ్గర 50 నుంచి 60 మంది లేడీ అర్టిస్టులు పని చేశారని.. కానీ ఎవరికీ ఎలాంటి ఫోన్ కూడా చేయలేదని అన్నారు. పిచ్చి పిచ్చి వేశాలు వేయడం అనేది నా కెరీర్ లోనే లేదని అన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు క్యాస్టింగ్ కౌచ్ గురించి లేవనెత్తిన విషయంపై ఆయన స్పందిస్తూ.. ఎదో ఎక్కడో ఉండే ఉంటాయి అని ఆయన అన్నారు. పుకార్లకు ఎక్కడ చోటు ఉండదు.. ఎక్కడైనా పుడుతూనే ఉంటాయని.. పెద్దపెద్ద సినీ నటులపైనే పుకార్లు షికార్లు అయ్యాయని అన్నారు.

మా ఎలక్షన్లలకు సంబంధించి మంచు విష్ణు తన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టిస్తానని మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సొంత డబ్బులు ఎవరి దగ్గర ఉండవు.. సూపర్ స్టార్ కృష్ట దగ్గర లేవా, చిరంజీవి వద్ద లేవా.. వాళ్ల కట్టలేకనా.. అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా బిల్డింగ్ కట్టడం వల్ల ఉపయోగం ఎవరికైనా ఉందా.. ఆర్టిస్టులు వెళ్లి ఏమైనా అందులో ఉంటారా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఫుడ్ లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటే.. బిల్డింగ్ కట్టడం వల్ల ఉపయోగం లేదన్నారు. నెలలో కనీసం 10 నుంచి 15 రోజుల వరకు ఆర్టిస్టులకు పని దొరికే విధంగా అవకాశం ఇవ్వండంటూ వారిని కోరారు కోట శ్రీనివాసరావు. మనం బాగుండాలి.. అందరూ బాగుండాలి అనేదే తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago