Featured

మోనితను చూసి షాకైన కార్తీక్.. పక్కా ప్లాన్ తో కిడ్నాప్!

బుల్లితెరపై ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ఎంతలా దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. కథ మొత్తం చివరి దశలో చేరిందని అనుకునేసరికి మళ్లీ మొదటికే వచ్చినట్లు అనిపిస్తుంది. పైగా కథ మొత్తం బాగా సాగదీయడంతో ప్రేక్షకులు కూడా సీరియల్ కు శుభం కార్డు ఉంటుందో లేదో అనుకుంటున్నారు.

ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం. సౌర్య కు జ్వరం రావడంతో వెంటనే సౌందర్య వెళ్లి హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఇక సౌర్య రాను అంటూ నాన్నను చూపిస్తేనే జ్వరం తగ్గుతుందని అంటుంది. ఇక తన తల్లి దీప గురించి కోపంతో మాట్లాడగా.. వెంటనే సౌందర్య దీప పడిన కష్టాల గురించి తెలుపుతుంది.

మరోవైపు మోనిత తను చేసుకున్న ప్లాన్ కోసం సిద్ధమవుతూ.. దేవుడి ముందు తనను, కార్తీక్ ను కలుపమని వేడుకుంటుంది. తప్పనిసరిగా కార్తీక్ ను హింసిస్తున్నానంటూ.. కార్తీక్ ఫోటో చూస్తూ క్షమించమని కోరుకుంటుంది.

జైల్లో ఉన్న కార్తీక్ కు కడుపు నొప్పి రావడంతో ఇబ్బందులు పడుతుంటాడు. అది చూసిన రత్న సీత మోనిత చేసిన ప్లాన్ వల్లే ఇలా జరిగింది అని బాధపడుతుంది. పక్కనే కానిస్టేబుల్ ను పిలిచి హాస్పిటల్ కి తీసుకెళ్తామని అడుగుతుంది.

కానిస్టేబుల్ వెంటనే కార్తీక్ ను చూసి ఇదంతా నాటకమని.. ఎంతో మందిని చూశాను అంటూ అనేసరికి రత్నసీత ఇదంతా నిజమే అంటూ కార్తీక్ ను హాస్పిటల్ లో చేరుస్తుంది.

దీప సౌర్య దగ్గరికి వచ్చి టాబ్లెట్ ఇస్తుండగా.. సౌర్య వేసుకోకుండా తన తండ్రి గురించి మాట్లాడుతుంది. అంతేకాకుండా తన మాటలతో దీప బాధ పడేలా చేస్తుంది. ఇక దీప సౌర్య మాటలకు సమాధానం చెప్పలేక కుమిలిపోతుంది.

మోనిత ముఖానికి చున్ని కట్టుకొని కార్తీక్ దగ్గరికి బయలు దేరుతుంది. దీప కూడా కార్తీక్ కు కడుపు నొప్పి వచ్చిందని తెలియడంతో ఏడుస్తూ ఆటోలో బయలుదేరింది.

హాస్పిటల్ లో కార్తీక్ కు కడుపునొప్పి ఎక్కువగా రావడంతో రత్న సీత వెంటనే డాక్టర్ ను పిలుస్తానని బయలుదేరగా.. అక్కడ చూసేవారికి మోనిత కనిపిస్తుంది. కార్తీక్ ను చంపేస్తావా అని రత్న సీత అడుగుతుంది.

వెంటనే మోనిత అరుస్తూ కార్తీక్ ను నేనెందుకు చంపుతాను అంటూ అక్కడ నుంచి కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది. కార్తీక్ కు ట్రీట్మెంట్ చేస్తుంది. దీప హాస్పిటల్ కి రావడంతో అక్కడ కానిస్టేబుల్, రత్న సీత లోపలికి పంపించకుండా చేస్తారు.

మోనిత మిస్టర్ కార్తీక్ అంటూ కార్తీక్ ను లేపుతుంది. అప్పటికే కార్తీక్ నోటికి ప్లాస్టర్, చేతులను తాడుతో కట్టేసి ఉంచగా ఇదంతా ఏంటని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే మోనిత తన అసలు రూపాన్ని చూపించగా కార్తీక్ షాక్ అవుతాడు. ఇదంతా మోనిత కార్తీక్ ను దక్కించుకోవడం కోసం పక్క ప్లాన్ తో కిడ్నాప్ చేయనున్నట్లుగా కనిపిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago