ఆ యువతి తన ప్రేమను పట్టుపట్టి సాధించుకుంది. పోలీసులు వారిద్దరిని ఒక్కటి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టేల కేశవాణి.. గాంధీనగర్ కు చెందిన యడ్ల భాస్కర్ రావు ప్రేమించుకున్నారు. ఏడేళ్ల నుంచి వారి ప్రేమ సాగుతోంది.
అయితే ఈ మధ్య అతడు తనను పెళ్లి చేసుకొమ్మని ఎన్నిసార్లు చెప్పిన దాట వేస్తూ వచ్చాడు. ఇలా అతడు పెళ్లికి నిరాకరిస్తూ వస్తుండగా.. ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిని స్టేషన్ కు పిలిపించి.. కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానంటూ అక్కడ నుంచి అతడు వెళ్లిపోయాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు కూడా స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచిపోయినా.. ఇంత వరకు అతడి నుంచి సమాధానం రాలేదు.
దీంతో చేసేది లేక.. ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కింది. పెళ్లికి ఒప్పుకోకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతానంటూ.. ట్యాంక్ ఎక్కి అక్కడే కూర్చుంది. కింద నుంచి చూసే ప్రతీ ఒక్కరు కంగారు పడ్డారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఆ యువకుడి బంధువులు కూడా చేరుకున్నారు.
ఆమెకు అతడితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చి అక్కడ నుంచి కిందకు దించారు పోలీసులు. వారిని అక్కడ నుంచి నేరుగా స్టేషన్ కు తీసుకెళ్లి.. ఇరువురి బంధువులను పిలిపించారు. ఎట్టకేలకే పోలీసులే పెళ్లి పెద్దలై వారిద్దరికి స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దండలు మార్పించారు. సంవత్సరంలోపు పెళ్లి చేసుకుంటానని అతడు పోలీసులు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన స్థానికులు పట్టుపట్టి తన ప్రేమను సాధించుకుందని ఆమెను ప్రశంసించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…