Featured

మోనితాకు షాక్ ల మీద షాక్ లు.. ఏం జరిగిందంటే..?

కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడో సీరియల్ ను క్లోజ్ చేస్తారని అనుకున్న వారందరికీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే 1104 ఎపిసోడ్‌లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. మోనిత ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ప్రియమణికి మోగుతున్న ఫోన్లతో కంగారు పడిపోయింది. దీంతో మోనిత పడుకొని ఉండగా.. ఆమెను లేపింది. ఏంటి అంటూ కసురుకుంటూ ప్రియమణిని అడిగింది. అమ్మా.. మీకు ఫోన్లు వస్తున్నాయి అని అంటుండగానే మరో ఫోన్ మోగింది.

దీంతో అందులో ఒక ఫోన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ నుంచి వచ్చింది. అందులో అతడు మోనితాకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంజి అనే వ్యక్తి 25న మీ పెళ్లికి అభ్యంతరం చెప్పాడని.. అతడిని ఒప్పిస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె కంగారు పడిపోయింది. తన పెళ్లిని కచ్చితంగా దీపానే అడ్డుకుంటుందని అనుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న దీపపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఎలాగైనా పెళ్లిని క్యాన్సిల్ చేసే ప్రయత్నాలు తిప్పి కొట్టాలని భావించింది. తర్వాత వెంటనే తనతో మోనిత పెళ్లికి అంజి అభ్యంతరం తెలపడంపై కార్తీక్‌లో ఆలోచనలు మొదలయ్యాయి.

గతంలో మోనిత గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా కొట్టిన విషయాలు గుర్తొచ్చాయి. అలాంటిది మోనిత పెళ్లిని ఎందుకు అడ్డుకొంటున్నాడు. నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయా అంటూ కార్తీక్ ఆలోచనల్లో పడిపోయారు. అంజిని దీప కలిసిందా అనే అనుమానం.. మోనితా మదిలో మెదిలింది. వెంటనే మరో ఫోన్ రాగానే ఆమె లిఫ్ట్ చేసింది. అటు ఫోన్ చేసింది రోషిణి. మోనితాను ఒకసారి కలవాలని ఆమె ఫోన్ లో చెప్పింది. ఎందుకు తనను కలవాలి అంటుందో అర్థం కాక.. ఇంకా కొత్త ఆలోచనలు ఆమెకు మొదలయ్యాయి.

ఈ గజిబిజి సమయంలో నే పనిమనిషి ప్రియమణిపై కోపం తెచ్చుకుంది. ఎప్పుడు కాఫీ అంటూ గొడవ ఏమిటి? నేను కాఫీ కోసమే పుట్టానా అంటూ కసురుకుంటుండగా.. అటు నుంచి దీపా నాకు ఇవ్వు నేను తాగుతా అని చెప్పింది. దీంతో మోనితా షాక్ కు గరయ్యింది. మోనితా ఇంట్లోకి దీపా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ చోటుచేసుకోనుందో చూడాలి..

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago