ఓటీటీలో సినిమా రిలీజ్ లను ఆపాలంటూ పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి విజ్ఞప్తి చేశాడు. ఆయన ఇండస్ట్రీ సమస్యలపై విలేకరులతో మాట్లాడుతూ.. టెక్నాలజీ డెవలప్‌మెంట్ ను ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కానీ అమర్త్య సేన్ చెప్పినట్లు సాంకేతిక విప్లవం అనేది అట్టడుగు వర్గాలకు చెందని నాడు వేస్ట్ కదా అని అన్నాడు.
ఓటీటీ కూడా అంతే కాదా.. ప్రతీ ఒక్కరికీ ఓటీటీ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు అట్టడుగున ఉండే వారికి.. పేదలకు, మారుమూల పల్లెల్లో ఉండే వారు ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. మొన్న రిలీజ్ అయిన నారప్ప సినిమా కూడా కేలవం 25 శాతం మంది మాత్రమే చూశారని అని తెలిపారు.
ఇప్పుడు కరోనా కష్టాలున్నాయి.. జన సమూహాలు ఉండకూడదు.. కరోనా మహమ్మారి ప్రపంచాలన్ని పట్టి పీడిస్తుంది.. కానీ కాలం చాలా గొప్పది.. అన్నీ వాటితోనే సమసిపోతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పీపుల్స్ స్టార్ చెప్పుకొచ్చాడు. ఓటిటి పేదవాళ్ల దగ్గర లేదని.. అందుకే నారప్పను 100 శాతం చూడలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పేదవాళ్లు, బడుగు బలహీన వర్గాలకు నారప్ప చూసే అర్హత లేదా అంటూ ప్రశ్నించాడు.
థియేటర్స్‌లో చూడాల్సిన సినిమాను ఇంట్లో కూర్చుని చూడటం థియేటర్స్ వ్యవస్థకే మంచిది కాదంటూ హెచ్చరించారు. థియేటర్స్ ఉండాల్సిందే అని.. అవి లేకపోతే స్టార్స్ ఉండరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటీటీల కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారిన.. థియేటర్స్ లు మూతపడే స్థితికి వచ్చిందని.. వీటంన్నింటిని దృష్టిలో ఉంచుకొని మళ్లీ థియేటర్లలోనే సినిమాలను విడుదల చేసే ఆలోచన చేయాలని సూచించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…