Movie News

జూలై 13 ఎపిసోడ్: దీప సౌందర్య రోడ్డు మీద పడే టైం వచ్చింది..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ నేడు (జులై 13)1090 ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. కార్తీక్ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా?? నువ్వు తప్పుల మీద తప్పులు చేయగల సమర్థరాలవని నమ్ముతున్నాను… నా మొగుడు సంస్కారవంతుడు గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాడు. నీలాగా గాలిక పుట్టి నీ ముందు తల వంచాల్సిన కర్మ నా మొగుడికి, నా కుటుంబానికి పట్టలేదు. ఆయన గురించి నాకు తెలుసు.. పిచ్చి పిల్ల? శీలాన్ని త్యాగం చేయకు..25న గుండె నొప్పి వస్తే మా ఆయన హాస్పిటల్లో చేరు.. మెంటల్ వస్తే పిచ్చాసుపత్రిలో చేరు ఇంకొకసారి నీ మొగుడు నాకే సొంతం అని వచ్చావ్ అనుకో శ్రీరామ్ బస్తీలో ఆడవాళ్లు నిన్ను పొలిమేరల దాకా తరిమి తరిమి కొడతారు. మళ్లీ నా జీవితంలోకి నా జోలికి కావాలంటే గజగజ వనికి చస్తావు గెటవుట్ అంటూ మోనితకు దీప వార్నింగ్ ఇస్తుంది. “చూస్తా మీ అందరి అంతు చూస్తా అంటూ మోనిత ఆవేశంగా వెళ్లిపోతుంది.

భాగ్యమ్మ ఇంటికి బ్యాగ్లు పట్టుకెళ్లి మీ గుణవతి మేడం ఎక్కడ అని అడగగా అందుకు ప్రియమని మీకు దండంపెడతా మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తే మా అమ్మగారు నన్ను ఇంటి నుండి బయటకు పంపుతారు మీరు వెళ్లిపోండి మీకు దండం పెడతా అని చెప్పడంతో భాగ్యం “అబ్బో.. మీ మేడమ్ ఎంత జీతం ఇస్తోందేంటీ”అని భాగ్యం అడగగా పాతికవేలమ్మ అని ప్రియమణి చెప్పడంతో నీ కడుపు ఎందుకు కొట్టాలిలే గేటు బయట కూర్చుంటానని బయట గేటు దగ్గర కూర్చుంటుంది.

ఇక ఆదిత్య దీపతో మాట్లాడుతూ… అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది వదిన మొన్న భాగ్యం అత్త తో కూడా ఎంతో అభిమానంగా మాట్లాడారట. దీప షాక్ అవుతూ పిల్లలకు మా పై చాలా అనుమానాలు వస్తున్నాయి అందుకే మేము మౌనంగా ఉండటం మానేశాము. ఇక సీన్ కట్ చేస్తే మోనిత ఏసీపీ రోషిణీ ఇంటికి వెళ్తుంది. ఎక్స్ క్యూజ్ మీ అని పిలవడంతో రోషిణీ బయటికి వస్తుంది. ‘ఎవరు’అనగానే గుర్తు పట్టడం లేదా మేడం… 10 సంవత్సరాల క్రితం దీప మిస్సింగ్ కేసులో నన్ను ఇంటరాగేట్ చేశారు. తరువాత తప్పు లేదని వదిలేసారు అని చెప్పడంతో రోషిని హో.. నువ్వు కార్తీక్ ఫ్రెండ్స్ కదా..?  ‘సిట్.. కమ్’ అని పిలిచి మరీ కూర్చోబెడుతుంది. మీ సమస్య ఏమిటో చెప్పండి. అని రోషిని అడుగుతుంది.

నాకు అన్యాయం జరిగింది పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను. అని చెప్పగా మీరు డాక్టర్ కదా.. ఎందుకు అలా తొందర పడ్డారు. ఎవరతను అని అడగడంతో డాక్టర్ కార్తీక్ అని సమాధానం చెబుతుంది.వాట్.. ఇద్దరూ ఫ్రెండ్సే కదా.. అతడికి పెళ్లి అయ్యింది కదా? ఒక గౌరవనియ్యమైన వృత్తిలో ఉన్న మీరు ఇలా చేయడం ఎంటి అని అడుగుతుంది.ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెబుతాను.అంటుంది మోనిత. ‘ఏం జరిగిందో చెప్పండి ఎలా జరిగిందో వివరించొద్దు’ అంటుంది రోషిణీ. దాంతో మోనిత.. ‘కార్తీక్‌ని పైకి తీసుకుని వెళ్లడం, మరునాడు ఉదయం కిందకి రావడం, నైట్ ఎక్కువగా తాగేశావ్ అని కార్తీక్‌తో అన్న సీన్ వరకు చెప్పి.. అది జరిగింది అదే చెప్పగా.. అందుకు రోషిణీ.. ఒక ఫ్రెండ్ ని ఇంట్లో కూర్చోబెట్టుకొని.. తాగడానికి పర్మిషన్ ఇచ్చి పడుకోవడానికి రూము ఇచ్చి కూడా మీరు ఆ గదిలోకి వెళ్లి ఏంటది మీ ఇద్దరి మధ్య కేవలం స్నేహం ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి అని ఏసీపీ ప్రశ్నించగా..

కార్తీక్ మొహం చాటేస్తున్నాడు. తన కుటుంబం నన్ను దూరం పెడుతుంది. కార్తీక్ కి ఎలాంటి శిక్ష లేకుండా కేవలం నా మెడలో తాళి కట్టి నన్ను భార్యగా స్వీకరిస్తే చాలు. ఇప్పుడు నాకు మీరు మాత్రమే సహాయం చేయగలరు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో రోషిని మీరు ఏడవకండి అంటూ ఆమెను ఓదారుస్తుంది. నా బిడ్డ తండ్రి లేని అనాధగా మారిపోతుంది. సాటి స్త్రీ గా ఆలోచించి నాకు సహాయం చేయండి.ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరు సహాయం చేసే వారు లేరు అని ఏడ్చగా ‘కూల్ కూల్.. ఓకే.. నేను ఎంక్వైరీ చేస్తాను.. మీకు న్యాయం జరిగేలా చేస్తాను.. డోంట్ వర్రీ.. ఎలాంటి ఆలోచన చేయకుండా ఇక్కడినుంచి వెళ్ళండి అంటూ సాగనంపుతుంది. ఆ దీప సౌందర్య అందరూ రోడ్డు మీద పడే టైం వచ్చింది అని మనసులో సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది.

ఇక దీప ఇంట్లో అందరూ సంతోషంగా ఉండగా రోషిణీ ఎంట్రీ ఇస్తుంది. ‘ఎక్స్ క్యూజ్ మీ’ అనగానే.. రోషిణీని గుర్తుపడుతుంది దీప. గతంలో నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని మరిపోకు దీపా’ అని అభయం ఇచ్చిన మాటలు గుర్తొచ్చి.. ‘రండి మేడమ్’ అంటుంది. లోపలికి వచ్చిన రోషిణీ ఎవరి తనని ఆదిత్యని చూసి అడగగా మా మరిది అంటూ పరిచయం చేస్తుంది. మా వదిన మిస్ అయినప్పుడు మీరే కదా ఎంక్వయిరీ చేసింది అని ఆదిత్య అంటాడు. అవును ఇప్పుడు విలువలు మిస్ అయ్యాయని కంప్లైంట్ వచ్చింది అంటుంది రోషిణీ. ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారని దీప అడగడంతో
మోనిత.. కార్తీక్ మీద ఇచ్చింది.. మోనితకి మీ భర్త అన్యాయం చేశాడని.. మీ కుటుంబం మొత్తం తనకు వ్యతిరేకంగా మారిందని న్యాయం కోసం వచ్చింది’ అంటుంది రోషిణీ. ‘న్యాయం చెయ్యండి.. న్యాయమే చేయండి మీరు న్యాయం వైపు నిలబడతారని నాకు తెలుసు అంటూ దీప చెబుతుంది.దీంతో దీప నా పేరు దీపం మా ఇంటి పేరు కార్తీక్ ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు 10 సంవత్సరాల క్రితం మేము విడిపోయాము. కార్తీక్ బాబు, మోనిత ఇద్దరూ కలిసి చదువుకున్నారు. 10 సంవత్సరాల నుంచి నేను విడిపోయిన చివరికి మేము కలుసుకునే సమయానికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని దీప అర్థమయ్యేలా వివరిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago