Categories: FeaturedMovie News

టిక్ టాక్ లో దుమ్మురేపుతున్న వంటలక్క వీడియో !!

ప్రేక్షకులను ఆకట్టుకునే నటనతో పాటూ.. తనని కలుసుకోవడానికి వచ్చిన అభిమానులకు కాస్త సమయాన్ని కేటాయించడంలోనూ, సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చెయ్యడంలోనూ మన వంటలక్క స్టైలే వేరు. లొకేషన్‌లో ఖాళీ సమయం దొరికితే చాలు టిక్ టాక్ వీడియోస్ కూడా చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. చిన్నా.. పెద్దా.. ఆడ.. మగా అందరూ.. సోమవారం నుంచి శనివారం వరకూ.. రాత్రి 7:30 అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోయేలా చేసింది కార్తీకదీపం. వంటలక్క విశ్వరూపానికి మిగతా సీరియల్స్ ఏవీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో బుల్లితెర బాహుబలిగా మారిపోయింది ఈ సీరియల్. దాంతో దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న నటి ప్రేమి విశ్వనాథ్… అంటే ఇప్పుడు తెలియని తెలుగువాళ్లు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. 1991లో జన్మించిన ప్రేమి విశ్వనాథ్.. మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం దీప లేదా వంటలక్కగానే పరిచయం. కేరళకు చెందిన ఈమె మొదట ‘కారుముత్తు’ అనే మలయాళం సీరియల్‌లో నటించింది. కళ్లతోనే హావభావాలను పలికించగల మన దీపక్క.. ఏ పాత్రలోనైనా వదిగిపోయే అందాల అభినేత్రి అంటే ఒప్పుకుని తీరాలి.

మునుమణి, కాయకులమ్ కొచున్నియుడే మకన్ వంటి మరిన్ని మలయాళం సీరియల్‌లో అక్కడ ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే తెలుగులో టాప్ రెటింగ్‌తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్.. నటనకు ఫిదా కానివారు ఉండరంటే నమ్మాలి. కష్టాన్ని గుండెల్లో దాచుకుని నవ్వాలన్నా, సంతోషాన్ని మనసారా వ్యక్తం చేయాలన్నా, కోపాన్ని కనురెప్పల్లోనే వ్యక్తపరచాలన్నా మన దీపక్క తర్వాతే ఎవరైనా అంటారు తెలుగు ప్రేక్షకులు. ఆమె కార్తీకదీపంలో చాలా నల్లగా ఉన్నప్పటికీ ఆమె నవ్వితే చాలా అందంగా కనిపిస్తుంది. చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని ఆ నవ్వే పడేసింది. వ్యక్తిత్వాన్ని చంపుకోలేని ఆత్మాభిమానం, ఎంత పెద్ద కష్టాన్నైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం. ఇవే.. ఈ నల్లటి పిల్లకి ఉన్న ప్రత్యేకమైన ఆభరణాలు. తన రంగు నలుపే కానీ తను నవ్వినా.. కనుబొమ్మలు ఎక్కుపెట్టి చూసినా.. భలే గమ్మత్తుగా, అందంగా ఉంటుంది. ‘స్వచ్ఛమైన మనసు, మాటపడని వ్యక్తిత్వం, అంతులేని దు:ఖం, దిక్కుతోచని అయోమయం, అప్పుడప్పుడూ ఆనందం. ఆ ఆనందంలోంచి వచ్చే ఓ వెర్రి నవ్వు’ ఇవే దీపని తెలుగు బుల్లి తెరకు దగ్గర చేశాయి. ప్రేక్షకుల ఆదరణకు కారణమయ్యాయి. ఆమె ఇప్పుడు బుల్లితెర మహానటిగా మారిపోయింది. అందం అంటే పైకి కనిపించే రంగు, రూపం కాదు.. కనిపించని ఆత్మసౌందర్యం అన్నట్లుగా తన ఔదార్యాన్ని చూపించే దీప.. తెలుగు తెర ప్రేక్షకులు చాలా సుపరిచితం. అయితే.. ఇంట్లో కూర్చుని టీవీలు చూసే వారి కంటే.. ఆన్‌లైన్, సోషల్ మీడియాలనీ ఫాలో అయ్యే ప్రేక్షకులకి ఈ వంటలక్క(దీప) గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..

దీప క్యారెక్టర్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్‌ది సీరియల్‌లో కనిపిస్తున్నట్లుగా నల్లటి రూపం కాదని.. చూడగానే ఆకట్టుకునే ముద్దమందారం లాంటి మోము అని చాలా మందికి తెలియదు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. కరోనా లాక్‌డౌన్ నేపధ్యంలో వెండితెర, బుల్లితెర షూటింగ్‌లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సినిమాలు, సీరియళ్లు మధ్యలోనే ఆగిపోయాయి. సినీ స్టార్లంతా ఇళ్లకే పరిమితమై.. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ’స్ తోనే గడుపుతున్నారు. క్వారంటైన్‌లో సినిమాలు చూస్తూ.. ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఇదేవిధంగా కార్తీక దీపం షూటింగ్ కూడా నిలిచిపోవడంతో.. ప్రేమి విశ్వనాథ్ కూడా ఇంటికే పరిమితమయ్యారు. క్వారంటైన్‌లో తాను కూడా ఇంటి పనులు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఐతే టిక్ టాక్‌లో ఈమధ్యనే ప్రేమి విశ్వనాథ్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంటి ముందు కారును శుభ్రంచేస్తూ క్లీనర్‌గా మారిపోయింది వంటలక్క. డస్టర్‌ను నీటిలో ముంచి కారు బ్యానెట్‌ను తుడుస్తూ వీడియోలో కనిపించింది.

@premivishwanath9

##car ##wash ##challeng ##karthikadeepam ##kerala ##crazy ##girl##love ##tiktok ##tiktok_india

♬ Manohari – Vijay Yesudas & Sayanora

ఆ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగానే స్పందిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లో జరిగినట్టుగానే నిజ జీవితంలోనూ నీకు ఎన్ని కష్టాలు వచ్చాయక్కా.. అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. మాయదారి కరోనా వల్లే నీకీ పరిస్థితి వచ్చిందంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. వంటక్కా.. మజాకా..!????????

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago