Karthikeya 2: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చితక సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోలను స్టార్ సెలబ్రిటీలు అణిచి వేస్తుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. అయితే హీరో నిఖిల్ విషయంలో ఇదే జరిగిందని ఆయన పరోక్షంగా వెల్లడించారు.
నిఖిల్ పెద్ద హీరో కాకపోయినప్పటికీ చివరికి ఆయన నటించిన సినిమాలను విడుదల చేయడానికి కూడా థియేటర్లో దొరక్కుండా చేసి ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని,వాళ్ల సినిమాలను విడుదల చేయడం కోసం తన సినిమాని పలుసార్లు వాయిదా వేశారని తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుతూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా తన సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని పంతం పట్టిన హీరోకి థియేటర్లు దొరకపోవడంతో ఎంతో బాధను అనుభవించారు.
అయితే నిఖిల్ సినిమాని వాయిదా వేసి తమ సినిమాలను విడుదల చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇకపోతే తరచు వాయిదా పడుతూ ఆగస్టు 13వ తేదీ విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పరుగులు పెడుతుంది. ఇలా నిఖిల్ అందుకున్న ఈ విజయం కొందరు సెలబ్రిటీలు ఓర్వలేకపోతున్నారనేది వాస్తవం.ఈ సినిమాని విడుదల చేయకుండా ఎలా అయితే అడ్డుకొని తమ సినిమాలను విడుదల చేసుకున్నారు.
ఆ సినిమాలకు మించి హిట్ అందుకోవడంతో ఎంతోమంది కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం అంటూ పలువురు నెటిజన్లు నిఖిల్ సినిమా గురించి, ఆయనని ఇబ్బందులు పెట్టిన వారి గురించి కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ ఎన్నో అవంతరాలు నడుమ తన సినిమాను థియేటర్లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఇదే స్థాయిలో విజయాన్ని అందుకోవడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…