Movie News

Geneliya: తన మామయ్యను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేసిన జెనీలియా.. వైరల్ అవుతున్న పోస్ట్!

Geneliya: జెనీలియా పరిచయం అవసరం లేని పేరు.జెనీలియా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే ఈమె నటుడు రిషితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత జెనీలియా పూర్తిగా నటినకు దూరమై ఇంటికి పరిమితమయ్యారు.

ఇకపోతే జెనీలియా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన అనంతరం ఈమె పూర్తిగా తన పిల్లల సంరక్షణ చేపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక జెనీలియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ఇంటికి కోడలుగా వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక జెనీలియా తన మామయ్యను కూడా పప్పా అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. ఇక ఈయన ఆగస్టు 14 2012 లో మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా తన పిల్లలు తనని ఓ ప్రశ్న అడిగారంటూ ఈమె తన మామయ్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పప్పా ఈరోజు రియాన్‌, రహైల్‌ నన్ను ఓ ప్రశ్న అడిగారు. అమ్మ మేము తాతను ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెబుతారా? అంటూ చెప్పుకొచ్చారు.ఈ ప్రశ్నకు తాను సమాధానం చెబుతూ మీరు వినగలిగితే సమాధానం చెబుతారు అని చెప్పానని ఈమె వెల్లడించారు.

Geneliya: వీ మిస్ యు పప్పా…

ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెబుతూనే ఉన్నారు. మీ సమాధానం నేను వింటూనే ఉన్నాను. మాకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఆ సమయంలో మీరు మాకు అండగా ఉన్నారు. మా కోసం మీరు అండగా ఉంటానని మీరు నాకు మాట ఇచ్చారు. మేము కళ్ళు చేవులు తెరిచి, మీ మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. వీ మిస్ యు పప్పా అంటూ తన మామయ్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago