Featured

Ajay Ghosh : సుకుమార్ ఒరేయ్ నీయమ్మ రండ్రా అనేసరికి… అల్లు అర్జున్ ఏం సినిమా చేయనన్నారంట అన్నారు : అజయ్ ఘోష్

Ajay Ghosh : డిడి దూరదర్శన్ లో తన ప్రయాణం మొదలు పెట్టిన అజయ్ ఘోష్ ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. ‘ప్రస్థానం’ సినిమాతో మొదలు పెట్టి ‘రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజ’ వంటి చాలా సినిమాల్లో నటించిన అజయ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఎక్స్ ప్రెస్ రాజా, విశారనై, అమ్మోరు తల్లి సినిమాలు. ఇక ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో తన నటనతో మరింత అభిమానులను సంపాదించుకున్నారు. తమిళంలో వచ్చిన ‘విశారనై’ సినిమా తెలుగులో ‘విచారణ’ పేరుతో డబ్ అయింది. ఈ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్.

బన్నీ అలా అనేసరికి ఆశ్చర్యపోయాను…

పుష్ప సినిమాలో సుకుమార్ ఒక పాత్ర కోసం ఆడిషన్ కి రమ్మన్నప్పుడు వెళితే ఆయన ఆడిషన్ తరువాత చాలా సేపు ‘విశారనై’ సినిమా లో నా నటన గురించి మాట్లాడారు. అంతకు ముందు ‘రంగస్థలం’ సినిమాలో కూడా నటించాను. ఇక పుష్ప లో చేసే సమయంలో కోవిడ్ బారిన పడటం వల్ల ఒంటరిగా ఉండి చాలా భయం వేసేది ఇక షూటింగ్ వద్దు అనుకున్నాను. రమ్మని కో డైరెక్టర్స్ చాలా చెప్పినా నేను షూటింగ్ రాను నన్ను వదిలేయండి అని చెప్పేసాను. మానసికంగా చాలా బాధపడుతున్న సమయంలో సుకుమార్ గారు ఫోన్ చేసి అరగంట మాట్లాడారు. ఆ అరగంట నాకు ఎంతో ధైర్యం చెప్పారు. ఇక అంతే వెంటనే షూటింగ్ వస్తానని చెప్పాను. ఇక సెట్స్ మొదట రోజు బన్నీ పక్కన కూర్చొని ఒక షాట్ అయ్యాక ‘చేయనన్నారట సినిమాలో అంటూ నవ్వాడు.. లేదు అంటూ ఏదో చెప్పబోతుంటే కథ విన్నప్పుడే ఆ పాత్రకు మీరే అని నేను ఉహించుకున్నాను’ అంటూ చెప్పడం తో ఆశ్చర్య పోయాను. అర్జున్ చాలా స్ఫూర్తినిస్తాడు, చిన్న ఆర్టిస్ట్ అయినా బాగా చేస్తే మెచ్చుకుంటూ ఉంటాడు అంటూ పొగిడారు అజయ్.

ఒరేయ్ రండ్రా నీయమ్మ అనే సరికి…

ఇక ఒక సన్నివేశం కోసం అడవిలో 500 మంది జూనియర్ ఆర్టిస్తులతో ఒక సన్నివేశం చేస్తున్నపుడు అందరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయింది. కో డైరెక్టర్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కొంతమంది వినడం లేదు. చివరికి సుకుమార్ ఒరేయ్ నీయమ్మా రండ్రా అనేసరికి అందరూ చటుక్కున కుదురుకున్నారు. కానీ ఆ తరువాత సుకుమార్ గారు అందరికీ అలా అన్నందుకు సారీ చెప్పారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి సారీ చెప్పారు. అంత క్రౌడ్ ని కంట్రోల్ చేయాలన్నపుడు ఎవరైనా కోపం తెచ్చుకుంటారు కానీ ఆయన అంత చిన్న మాట అన్నందుకు అందరికీ సారీ చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. నా కెరీర్ చూసుకుంటే పుష్ప సినిమా కోసం ఒక పేజీ ఉంటుంది అంటూ చెప్పారు అజయ్ ఘోష్.

Bhargavi

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

3 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

3 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

3 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

3 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

3 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

4 hours ago