Categories: FeaturedMovie News

Rajeev Kanakala : దిల్ రాజు అడిగితే డేట్స్ ఇవ్వలేదని… ఆ డైరెక్టర్ నన్ను వెధవ అని తిట్టాడు : రాజీవ్ కనకాల

Rajeev Kanakala : దేవదాస్ కనకాల గారి అబ్బాయి గా ఫిల్మ్ ఇండస్ట్రీ కి పరిచయమైన రాజీవ్ కనకాల మొదట టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు, ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలుత దూరదర్శన్ ఛానెల్ లో పనిచేసిన రాజీవ్ కనకాల ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయంతో యాంకర్ సుమ ను ప్రేమించి పెళ్లాడారు. ఇక సినిమాల్లో కూడా విలన్ పాత్రలను, సహాయక పాత్రలను చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలను చేస్తున్నారు.

దిల్ రాజు అడిగితే డేట్స్ ఇవ్వలేదు…

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ పాత్రల్లోను తనదైన నటనతో మెప్పించిన రాజీవ్ దిల్ రాజు సినిమా అవకాశం ఇచ్చినపుడు డేట్స్ కుదరక చేయలేక పోయాడట. అపుడు దిల్ రాజు నా సినిమాలో చేయలేదు అని అనే వాడట, ఆ తరువాత వరుసగా ఆరు సినిమాల్లో రాజీవ్ నటించారు. దువ్వాడ జగన్నాదం సినిమాలో నటించినా నేను నటించిన సన్నివేశం ఎడిటింగ్ లో పోయింది. ఇక పెద్ద వంశీ గారి దగ్గర సాన్నిహిత్యం ఎక్కువ ఉండడం వల్ల ఆయన నన్ను వెధవ అని పిలిచేవాడు. దేవదాస్ గారి అబ్బాయి మా గురువు గారి అబ్బాయి, వెధవ బాగా నటిస్తాడు అంటూ వేరే వాళ్లకు చెప్పేవాడు.

అంతా బాగుంది మధ్యలో వెధవ ఎందుకు సార్ అని అడిగితే అది అంతే అని నవ్వేవారు అంటూ ఆయనతో ఉన్న సన్నిహిత్యం గురించి చెప్పేవారు. ఇక రంగస్థలం సినిమాలో చేసినది చిన్న పాత్ర అయినా కష్టపడ్డామని, గోదావరి లంక లో బాగా వేడి ఉన్న ప్రదేశంలో పరిగెత్తే సన్నివేశం అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము కానీ అనుకున్న దానికంటే త్వరగా షూటింగ్ ముగించాము అంటూ చెప్పారు. ఇక రాజీవ్ కనకాల, సుమ గారి అబ్బాయి రోషన్ ను సినిమాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago