Kasthuri Shankar : సీనియర్ హీరోయిన్ కస్తూరి అందరికీ సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించిన కస్తూరి అందరికీ సుపరిచితమే. ఇక సినిమాల తరువాత బిగ్ బాస్ తమిళ్ లో పాల్గొని మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అప్పుడప్పడు టీవీ షోలలో గెస్ట్ గా వచ్చి అలరిస్తున్న కస్తూరి మా టీవిలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర అభిమానులకు పరిచయం. సీరియల్ లవర్స్ చాలా మంది ఇష్టపడుతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఆ సీరియల్ లో తులసి గా మెయిన్ లీడ్ లో నటించింది. ఆ సీయల్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది.
సముద్రపు అలలలో కొట్టుకుపోయిన కస్తూరి…
సీరియల్ లో తులసి గా నటించిన కస్తూరి సీరియల్ లో సముద్రపు అలలలో ఆడుకుంటూ ఒక్కసారిగా కొట్టుకుపోయింది. ఇదంతా సీరియల్ లో భాగమే అయినా సీరియల్ అభిమానులు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. తులసి కి ఏమైందో అని చాలా టెన్షన్ పడుతున్నారు. అలల్లో ఆడుకుంటూ అలలలో కొట్టుకుపోయిన తులసి అంటూ ప్రోమోని మా టీవీ విడుదల చేసింది.
ఇక ప్రోమో చూసాక అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అసలే సీరియల్స్ అంటే పిచ్చి అభిమానం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక ఎన్నో ఏళ్లుగా సాగే సీరియల్స్ లో పాత్రలను తమ ఇంట్లో వాళ్లలాగా అనుకుంటూ వాళ్ళ కష్టాలను తమ కష్టాలలాగా ఫీల్ అయిపోతుంటారు. అలాంటిది ఇక ఫేవరెట్ సీరియల్ లోని తులసి పాత్రకు ఏదో అయిందని తెగ టెన్షన్ పడుతూ ఉన్నారు. తులసి… అదే కస్తూరి కి ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం సీరియల్ చూడాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…