Getup Seenu : జబర్దస్త్ ద్వారా బుల్లితెర కమల్ హాసన్ అని పేరు తెచ్చుకున్న గేటప్ శీను అటు జబర్దస్త్ తో పాటు సినిమాల్లోను మంచి అవకాశాలతో బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాలో నటించాడు శీను. ఇక ఆ సినిమా ఈవెంట్ వరంగల్ లో చాలా గ్రాండ్ గా చేసారు. ఆ ఈవెంట్లో శీను మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు.
మూడు రోజులకు 50 వేలు… వద్దనుకున్నా…
శీను లైగర్ ఈవెంట్లో బాలకృష్ణ పైసా వసూలు సినిమాలోని తేడా సింగ్ డైలాగులను మిమిక్రి చేసి అందరినీ నవ్వించాడు. ఇక అదే బాలయ్యబాబు డైలాగ్ ని విజయ్ దేవరకొండ చెబితే ఎలా ఉంటుందో చేసి చూపించి నవ్వించాడు. ఇక సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ విజయ్ స్నేహితుడిగా నేను లైగర్ సినిమాలో నటించాను. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సింగ్ చేస్తాడు. అందుకోసం బ్యాంకాక్ వెళ్లి శిక్షణ తీసుకున్నాడు.
అందుకే అతని స్నేహితుడు క్యారెక్టర్ చేస్తున్న నేను కొంచమైనా బాక్సింగ్ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే తైక్వాండో నేర్చుకుందామని ట్రైనర్ ని పిలిపించుకుంటే అతను మూడు రోజులకు యాభై వేలు ఫీజు అడిగాడు. షాక్ అయి నా రేంజ్ అది కాదులే అని వద్దనుకున్నాను అంటూ చెప్పాడు. ఇక లైగర్ సినిమా ఈ నెల 25 న పలు భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక మైక్ టైసన్, రమ్యకృష్ణ, విష్ణు రెడ్డి, మకరంద్ దేశ పాండే, రోనిత్ రాయ్, గేటప్ శీను ముఖ్య పాత్రలలో నటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…