ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రంతో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్జీవి వరల్డ్’ ఆన్ లైన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న వర్మ పవన్ ఫ్యాన్స్ ను ఎంత రెచ్చగొడితే అంత లాభం అనే విధంగా ఈ చిత్రం ప్రమోషన్స్ డోస్ ను పెంచుతున్నాడు.
అయితే మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రాండ్ తో ఆర్జీవికి కౌంటర్ ఇచ్చే విధంగా పవన్ ఫ్యాన్స్ ‘పరాన్న జీవి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ పేరు చెబితేనే మండి పడిపోయే వ్యక్తి క్రిటిక్స్ రైటర్ కత్తి మహేష్. పవన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతాడా? అని ఎదురు చూస్తుండే వ్యక్తులలో కత్తి మహేష్ ముందుంటాడు. అలాంటి కత్తి మహేష్ ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా మారిపోవడం నిజంగా విచిత్రం. కానీ ఇదంతా నిజమేనని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే..
కత్తి మహేష్ ని పవన్ ఫ్యాన్ గా పరాన్న జీవి చిత్రంలో చూడబోతున్నారన్నమాట. పవన్ ఫ్యాన్స్ అంతా కలిసి నిర్మిస్తున్న చిత్రం పరాన్న జీవి. పవన్ కాంపౌండ్‌కి అత్యంత సన్నిహితుడైన నూతన్ నాయుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఈ పాత్రకు ఒప్పుకోవడం ఒక ట్విస్ట్ అయితే, కత్తి మహేష్ తోనే ఆ పాత్ర చేయించాలన్న ఆలోచన రావడం మరో ఆశ్చర్యకరమైన విషయం. మీరు ఊహించని మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ చిత్రంలోనూ పవన్ ని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టు పాత్రలో కత్తి మహేష్ నటించాడు. ఈసినిమాకి కౌంటర్ గా తీస్తున్న పరాన్న జీవిలోనూ కత్తి మహేష్ పవన్ ఫ్యాన్ గా నటిస్తుండటం నిజంగా ట్విస్ట్ లకే ట్విస్ట్ అని చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…