ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ చిత్రంతో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్జీవి వరల్డ్’ ఆన్ లైన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న వర్మ పవన్ ఫ్యాన్స్ ను ఎంత రెచ్చగొడితే అంత లాభం అనే విధంగా ఈ చిత్రం ప్రమోషన్స్ డోస్ ను పెంచుతున్నాడు.

అయితే మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రాండ్ తో ఆర్జీవికి కౌంటర్ ఇచ్చే విధంగా పవన్ ఫ్యాన్స్ ‘పరాన్న జీవి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెబితేనే మండి ప‌డిపోయే వ్య‌క్తి క్రిటిక్స్ రైటర్ క‌త్తి మ‌హేష్‌. ప‌వ‌న్ ఎప్పుడు, ఎక్క‌డ, ఎలా దొరుకుతాడా? అని ఎదురు చూస్తుండే వ్యక్తులలో కత్తి మహేష్ ముందుంటాడు. అలాంటి క‌త్తి మ‌హేష్ ఒక్కసారిగా ఎవరూ ఊహించని విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ గా మారిపోవడం నిజంగా విచిత్రం. కానీ ఇదంతా నిజమేనని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే..

కత్తి మహేష్ ని పవన్ ఫ్యాన్ గా ప‌రాన్న జీవి చిత్రంలో చూడబోతున్నారన్నమాట. ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా క‌లిసి నిర్మిస్తున్న చిత్రం ప‌రాన్న‌ జీవి. ప‌వ‌న్ కాంపౌండ్‌కి అత్యంత స‌న్నిహితుడైన నూత‌న్ నాయుడు ఈ సినిమాకి ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కత్తి మ‌హేష్ ప‌వ‌న్‌ కళ్యాణ్ ఫ్యాన్ గా ఈ పాత్రకు ఒప్పుకోవ‌డం ఒక ట్విస్ట్ అయితే, కత్తి మ‌హేష్ తోనే ఆ పాత్ర చేయించాలన్న ఆలోచ‌న రావ‌డం మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం. మీరు ఊహించని మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ‘ప‌వ‌ర్ స్టార్‌’ చిత్రంలోనూ ప‌వ‌న్ ని ఇంట‌ర్వ్యూ చేసే జ‌ర్న‌లిస్టు పాత్రలో కత్తి మ‌హేష్ న‌టించాడు. ఈసినిమాకి కౌంట‌ర్ గా తీస్తున్న ప‌రాన్న‌ జీవిలోనూ కత్తి మ‌హేష్‌ ప‌వ‌న్ ఫ్యాన్ గా నటిస్తుండటం నిజంగా ట్విస్ట్ లకే ట్విస్ట్ అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here