Katragadda Prasad : డిస్ట్రిబ్యూషన్ తో మొదలు పెట్టి సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ సినిమాలను తీసిన కాట్రగడ్డ ప్రసాద్ గారు ప్రస్తుతం సినిమా నిర్మాణంకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడొస్తున్న నిర్మాతలకు పెద్దగా విలువ ఉండటం లేదని, అందుకే తాను సినిమాలకు దూరంగా ఉన్నట్లు ప్రసాద్ గారు చెబుతారు. ఇక అయన సుమన్ కష్ట సమయాల్లో ఉన్నపుడు సినిమా నిర్మాతగా అడుగు వేసి ఆయనతోనే మొదట సినిమా చేసారు కాట్రగడ్డ ప్రసాద్ గారు. ఇక అలా అంచెలంచెలుగా ఎదిగిన ప్రసాద్ గారు నిర్మాతల మండలి సెక్రటరీగా, అధ్యక్షుడుగా సేవలను అందించారు. అలా ఆయన నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడారు.
ఇలియానా సౌత్ లో సినిమాలు చేయకపోడానికి కారణం…
కాట్రగడ్డ ప్రసాద్ గారు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నింటిలోనూ నిర్మాతలు ఎలా కలిసికట్టుగా ఉంటారో వివరిస్తూ హీరోయిన్ ఇలియానా ఉందంతం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలియానా ఒక తమిళ సినిమా ఒప్పుకుని అడ్వాన్స్ గా 40 లక్షలు తీసుకుని ఆ తరువాత సినిమా షూటింగ్ కి హాజరు కాలేదు. ఆ సినిమా మొదటి షెడ్యూల్ ఆమె వల్ల వాయిదా పడి మళ్ళీ వేరే హీరోయిన్ ను పెట్టుకుని సినిమాను తీశారు. ఇక ఆమెకు అడ్వాన్స్ వెనక్కి ఇమ్మని అడిగితే ఇవ్వకపోవడంతో ఆమెపై నడిగర్ సంఘం అలానే సౌత్ నిర్మాతల మండలి లో ఆమెపై నిర్మాత నటరాజన్ ఫిర్యాదు చేసారు. ఆమెను వివరణ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. ఆమె తరుపున మేనేజర్ వచ్చి డబ్బు వెనక్కి ఇవ్వమని కావాలంటే మరో సినిమా చేస్తుందంటూ చెప్పడంతో ఆమె పై పాండమిక్ సమయంలో బ్యాన్ విధించాము, మొత్తం సౌత్ భాషలలో ఆమె నటించడానికి వీలు లేకుండా చేసాం అంటూ కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు.
ఇక కొంత మంది అప్పటికే వాళ్ళ సినిమాలకు ఆమెను తీసుకోగా వారితో మాట్లాడి విరమించుకునేలా చేయగా మరి కొంతమంది బ్యాన్ అని తెలిసీ ఆమెతో సినిమా చేయాలని అనుకుంటే వారిని పిలిచి ఆమె ఎగొట్టిన 40 లక్షలు కట్టి ఆమెను సినిమాలో పెట్టుకోమని చెప్పాము, దీంతో ఆమెను ఎవరూ సినిమాలోకి తీసుకోలేదు. ఆమె లాస్ట్ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ బ్యాన్ కి ముందే షూటింగ్ అయిపోయి లేటుగా విడుదల అయింది అంటూ చెప్పారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…