Doctor Ravikanth : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ సభకు హాజరై అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్నకు గుండె నొప్పి రావడంతో తనని చికిత్స కోసం బెంగళూరు లోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన హెల్త్ బులిటెన్ లో బ్రెయిన్ కి సంబంధిచిన డామేజ్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ విషయాల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ రవికాంత్ గారు వివరించారు.
ఐదు నిముషాలు ఆలస్యమైనా…
రవికాంత్ గారి తారక రత్న హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఆవును ఆయనకు పాదయాత్ర సమయంలో ఆ జనం గుంపులో గుండె పోటు వచ్చిన సమయంలో మొదటి కొద్ది నిముషాలు అత్యంత కీలకం, ఆ సమయంలో వెంటనే చేస్ట్ కంప్రెస్స్ చేసి సీపీఆర్ చేయడం వల్ల ఆయన బ్రతికాడు. ఆ సమయంలో టైంకి అలా చేయకుండా ఉండుంటే గుండె ఆగయిపోవడం వల్ల బ్రెయిన్ కి రక్తం సరఫరా ఆగిపోయి డామేజ్ అయ్యుండేది. అయితే సీపీఆర్ చేయక ముందు రక్తం సరఫరా ఎంత శాతం వరకు బ్రెయిన్ కు ఆగిపోయింది అన్న విషయం మీద బ్రెయిన్ డామేజ్ ఆధారపడి ఉంటుంది.
వెంటనే చేసినా ఆయనకు గుండె పోటు రావడానికి చికిత్స అందడానికి మధ్య ఉన్న సమయంలో జరిగిన విషయాలు కీలకం. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందుకుంటున్న తారకరత్న చికిత్సకు కొద్దిగా స్పందిస్తున్నారు. అయితే ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు అంటే కోలుకునే అవకాశాలు చేజరుతున్నాయి అన్నది చేదు నిజం. కాకపోతే న్యూరాలోజిస్ట్ లు పరీక్షలు జరిపి అసలు బ్రెయిన్ ఎంత డామేజ్ అయింది, దానికి చికిత్స ఎమి ఇవ్వాలి అన్నది ఆల్రెడి డిసైడ్ చెసుంటారు. అయితే ప్రస్తుతానికి మొదటి 45 నిముషాలు వెంటనే కుప్పంలో అందించిన వైద్యం వల్లే తారక రత్న ఇంకా ఉన్నారన్నది వాస్తవం అంటూ చెప్పారు డాక్టర్ రవికాంత్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…