Kadambari Kiran: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు సినిమాలలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి గుర్తింపు పొందారు. ఇలా ఎన్నో సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కాదంబరి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాదంబరి కిరణ్ ఇటీవల నారప్ప, భీమ్లా నాయక్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలలో నటించాడు.
ఇప్పటివరకు దాదాపు 290 కి పైగా సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇలా సినిమాలలోనే కాకుండా అనేక సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా నేను సైతం అనే ఒక సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. అలాగే మా(‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’) సభ్యుడిగా కూడా కాదంబరి కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కాదంబరి ఇంట్లో పెళ్ళి సందడి చాలా ఘనంగా జరిగింది. కాదంబరి కిరణ్ కూతురు డా.పూర్ణ సాయి శ్రీ వివాహం సాయి భార్గవ్ అనే వ్యక్తితో హైదరాబాద్ లోని ‘తారామతి బారాదరి’ లో చాలా ఘనంగా జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అలాగే ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్, హీరో శ్రీకాంత్,మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, అలీ వంటి ఎందరో సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం కాదంబరి కూతురు పూర్ణ సాయి శ్రీ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…