Vijay Devarakonda -Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండటం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి కొంతమంది పెళ్లి చేసుకొని విడిపోయారు. తాజాగా టాలీవుడ్లో హీరో హీరోయిన్లు ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో హీరోయిన్ మరెవరో కాదు… గీత గోవిందం సినిమాలో జంటగా నటించిన హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్స్ సినిమాలో కూడా నటించారు. ఇలా రెండు సినిమాలలో జంటగా నటించడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేయటంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చక్కర్లు కొట్టాయి.
ఈ వార్తల గురించి రశ్మిక స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదనీ స్పష్టం చేశారు. కానీ ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఇక తాజాగా వీరి ప్రేమ వార్తలు మరొక సారి వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తాజాగా ఇద్దరూ కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా విజయ్ తన కుటుంబంతో కలిసి దుబాయిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే విజయ్ కుటుంబంతో పాటు రష్మిక కూడా వారితో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రష్మిక తరచూ విజయ్ ఇంటికి వెళ్తూ వచ్చేది. ఇక ఇప్పుడు ఇలా విజయ కుటుంబంతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేయటంతో వీరి ప్రేమ గురించి వస్తున్న వార్తలు నిజమేనని నెటిజన్ లు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…