Siddharth -Aditi Rao: బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బాయ్స్ వంటి సినిమాల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొంది ఎంతోమంది యువతకు అభిమాన హీరోగా నిలిచాడు సిద్దార్థ్. ఆ తర్వాత సిద్ధార్థ నటించిన సినిమాలు సరైన హిట్ అందుకోకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో మఖాం వేశాడు. అయితే అక్కడ కూడా సరైన హిట్లు లేక చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.
దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహాసముద్రం సినిమా ద్వారా సిద్ధార్థ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలి నిర్మాతలకు నష్టాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా ద్వారా నిర్మాతలు నష్టపోయిన కూడా సిద్ధార్థ మాత్రం బాగా లాభపడ్డాడు. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ 8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోవడమే కాకుండా ఇక హీరోయిన్ అదితి రావుతో కూడా మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.
ఆ తర్వాత వీరిద్దరూ కూడ రిలేషన్ లో ఉన్నారని, అంతేకాకుండా సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాకుండా ఇటీవల హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇలా కపుల్స్ లాగా వీరిద్దరూ శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి హాజరు కావడంతో వీరిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి నిజమే కానీ పెళ్ళికి మాత్రం నో చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే గతంలో కూడా వీరిద్దరికీ వివాహం అయ్యి విడాకులకు కూడా తీసుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసి వివాహం చేసుకొని ఆలోచన లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరూ ఎంత కాలం ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తారో చూడాలి మరి.ఇలా వీరి రిలేషన్ గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం ఈ వార్తలపై ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…