ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్, నటుడు కత్తి మహేష్ కు పెను ప్రమాదం తప్పింది.తాజాగా కత్తి మహేష్ వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో కత్తి మహేష్ కు తీవ్ర గాయలయ్యాని తెలుస్తుంది. తృటిలో ఇతనికి పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో మహేష్ కారు మొత్తం నజ్జు నజ్జు అయిపొయింది.
కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయలయ్యని తెలుస్తుంది.. ప్రమాదం జరిగిన వెంటనే కత్తి మహేష్ ను చికిత్స నిమిత్తం నెల్లూరు మెడికేర్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన తలకు తీవ్ర గాయం కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పట్ల అయన బంధువులు అంధోల వ్యక్తం చేస్తున్నారు.
కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఏ విధంగా ప్రమాదానికి గురైనదనే విషయం తెలియలేదు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కత్తి మహేష్ గతంలో పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు, వివాదాస్పద పోస్తులలో బాగా పాపులర్ అయ్యారు. అదే విధంగా రామాయణం గురించి కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అతనిని కొన్ని రోజులపాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణ చేసిన సంగతి మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మహేష్ పలు సినిమాలలో కీలక పాత్రలో నటిస్తున్న కత్తి మహేష్ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…