ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ముందంజలో ఉన్న చానల్స్ ఏవైనా ఉన్నాయా అంటే అందులో ముందు వరుసలో స్టార్ మా తప్పనిసరిగా ఉంటుంది. స్టార్ మా, ఈ టీవీ, జీతెలుగు మధ్య ఎప్పుడు గట్టి పోటీనే ఉంటుంది. ఇక సినిమాల విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా సాటిలైట్ లను కొనుగోలు చేసే విషయంలో స్టార్ మా, జీ తెలుగు భారీగా పోటీ పడతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ పలు సినిమా శాటిలైట్ లను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. తాజాగా స్టార్ మా కొనుగోలు చేసిన సినిమాలు వాటి వివరాలను విడుదల చేశారు. స్టార్ మా కొనుగోలు చేసిన శాటిలైట్ లో పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉండడం విశేషం.
ఇందులో రాజమౌళి ఆర్ఆర్ఆర్, సుకుమార్ పుష్ప చిత్రాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా బాలకృష్ణ అఖండ, నాని టక్ జగదీష్, రవితేజ ఖిలాడి, మహేష్ బాబు సర్కారీ వారి పాట, నాగచైతన్య లవ్ స్టోరీ వంటి సినిమాలను స్టార్ మా దక్కించుకుంది. అయితే ఈ సినిమాలలో కేవలం టక్ జగదీష్ , లవ్ స్టోరీ సినిమాలు మాత్రమే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. అంటే ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయ్యి బుల్లితెరపై ప్రసారం కావాలంటే మరికొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. ఈ సినిమాలు థియేటర్లో ఏవిధంగా రికార్డులను సృష్టిస్తాయో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…