తెలుగు బుల్లి తెలుగు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో విజేతగా నిలబడిన కౌశల్ మండా గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ టు టైటిల్ గెలుచుకున్న కౌశల్ బిగ్ బాస్ తర్వాత ఫుల్ బిజీగా ఉంటారని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ ఈయన మాత్రం ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా, కేవలం యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం కౌశల్ సునీల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అతడు ఆమె ప్రియుడు అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కౌశల్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కౌశల్ మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతుంది. ఈ సీజన్లోనైనా అమ్మాయిలు విజేతలుగా నిలబడతారు అనుకుంటే అలాంటి అవకాశమేలేదని కౌశల్ తెలియజేశారు.
బిగ్ బాస్ సీజన్లో ఈసారి కూడా అబ్బాయిలే గెలుస్తారని కౌశల్ జోస్యం చెప్పారు. ఇకపోతే 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఆరు మంది లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కావడం గమనార్హం. ఇక హౌస్ లో సిరి, కాజల్, ప్రియాంక, అనీ మాస్టర్లు మరొక కొన్ని వారాలు ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చిన ఫైనల్లో అమ్మాయిలు ఉన్నప్పటికీ వారు మాత్రం బిగ్ బాస్ ట్రోఫీని అందుకోలేదని తెలియజేశారు.
మరి కౌశల్ అంచనాల ప్రకారం ఈ సీజన్లో కూడా అబ్బాయిల గెలుస్తారా.. లేకపోతే బిగ్ బాస్ ట్రోఫీని ఎవరూ ఊహించని విధంగా అమ్మాయిలు అందుకుంటారా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని వారాలు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…