గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఈరోజు ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరగాలని, గ్రేటర్ ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని అయన కోరారు. ప్రభుత్వం పనితీరు చూసి ఓటు వేయాలని, సందర్భాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎవరెవరి వైఖరి ఎలా ఉంది..? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి అని సూచించారు.
ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణవాళ్ళు తెలంగాణను పరిపాలించుకోలేరని కొందరు విమర్శించారని అయన గుర్తుచేసుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరెంట్ బాధలు తీర్చాం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు. రాజకీయ పార్టీగా పని చేస్తుందని గతంలోనే చెప్పాను. అధికారంలోకి వచ్చాక మరింత మేచ్యురిటీతో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని, హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మా బిడ్డే అని ఎప్పుడో చెప్పాం. గత ఆరేళ్లలో ఎలాంటి వివక్ష లేకుండా పాలన చేశామని సిఎం కెసిఆర్ అన్నారు.
భారతదేశంలో ఎక్కడా వరదలు రాని నగరం లేదు. ఎక్కడాలేని విధంగా ఇంటికి 10 వేల రూపాయిలు ఇస్తున్నాం. ప్రధాని మోదీని రూ.1,౩౦౦ కోట్లు అడిగితె 13 పైసలు కూడా ఇవ్వలేదు. బెంగళూరు, అహ్మదాబాద్ కు ఇచ్చారు మేం ఎం పాపం చేసాం ఆని అడిగారు. మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎంతమంది నాయకులా? ఒక్క బక్కోడిని కొట్టేందుకు ఇంతమందా? అంటూ ప్రసంగించారు సిఎం కెసిఆర్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…