గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఈరోజు ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరగాలని, గ్రేటర్ ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని అయన కోరారు. ప్రభుత్వం పనితీరు చూసి ఓటు వేయాలని, సందర్భాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఎవరెవరి వైఖరి ఎలా ఉంది..? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి అని సూచించారు. 

ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. తెలంగాణవాళ్ళు తెలంగాణను పరిపాలించుకోలేరని కొందరు విమర్శించారని అయన గుర్తుచేసుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరెంట్ బాధలు తీర్చాం అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు. రాజకీయ పార్టీగా పని చేస్తుందని గతంలోనే చెప్పాను. అధికారంలోకి వచ్చాక మరింత మేచ్యురిటీతో టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని, హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మా బిడ్డే అని ఎప్పుడో చెప్పాం. గత ఆరేళ్లలో ఎలాంటి వివక్ష లేకుండా పాలన చేశామని సిఎం కెసిఆర్ అన్నారు.

భారతదేశంలో ఎక్కడా వరదలు రాని నగరం లేదు. ఎక్కడాలేని విధంగా ఇంటికి 10 వేల రూపాయిలు ఇస్తున్నాం. ప్రధాని మోదీని రూ.1,౩౦౦ కోట్లు అడిగితె 13 పైసలు కూడా ఇవ్వలేదు. బెంగళూరు, అహ్మదాబాద్ కు ఇచ్చారు మేం ఎం పాపం చేసాం ఆని అడిగారు. మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఎంతమంది నాయకులా? ఒక్క బక్కోడిని కొట్టేందుకు ఇంతమందా? అంటూ ప్రసంగించారు సిఎం కెసిఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here