Keeravani: టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లుగా కీరవాణి కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కీరవాణి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. బాహుబలి సినిమాలో కీరవాణి అందించిన సంగీతం ఆ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా కీరవాణి సంగీతం అందించాడు. ఇలా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తల్లి బాల సరస్వతి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. వయసు పెరగటంతో ఆమె అనారోగ్యం పాలై కొంతకాలంగా ఇబ్బంది పడుతోంది. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కీరవాణి తల్లి ఆరోగ్యం ఇటీవల మరింత విశమించటంతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కీరవాణి తల్లి కాసేపటి క్రితం తుది శ్వాస విడిచింది.
బాల సరస్వతి మరణంతో కీరవాణి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకులకు ఆమె తో మంచి అనుబంధం ఉంది. అయితే ఇలా ఆమె మరణించడంతో కీరవాణి రాజమౌళి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కీరవాణి తల్లి మరణ వార్త తెలియటంతో పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. మరి కాసేపట్లో కీరవాణి తల్లి మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి తరలించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కీరవాణి తల్లి మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…