Singer Lakshmi Prathima: ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావటంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉంటూ ఈ డిసెంబర్ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా సింగర్ లక్ష్మి ప్రతిమ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఒక ఇంటిది అయ్యింది. 2020లో ప్రసారమైన సరిగమప సింగింగ్ ఐకాన్ షో ద్వారా పాపులర్ అయిన లక్ష్మి ప్రతిమ ఇటీవల ఒక మీమర్ ని వివాహం చేసుకుంది.
వైజాగ్ కి చెందిన లక్ష్మీ ప్రతిమ సరిగమప సింగింగ్ షో ద్వారా సింగర్ గా పాపులర్ అయ్యి ప్రస్తుతం పలు అవకాశాలు అందుకుంటుంది. ఇటీవల ఒక మీమర్ ని వివాహం చేసుకున్న లక్ష్మీ ప్రతిమ ఆమె పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో లక్ష్మీ ప్రతిమ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లక్ష్మీ ప్రతిమ వివాహం చేసుకున్న వ్యక్తి గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. సింగర్ గా గుర్తింపు పొందిన ప్రతిమ హర్ష సాయి అనే ఒక ఫేమస్ మీమర్ ని వివాహం చేసుకుంది . హర్షా సాయి ఎంత పాపులర్ అంటే జాతీయ మీడియా కూడా ఇతడిని పొగుడుతూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
అయితే హర్ష సాయి మీమర్ గా మాత్రమే కాకుండా డాన్సర్, కంటెంట్ క్రియేటర్ కూడా మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి. ఒకరకంగా చూసుకుంటే లక్ష్మీ ప్రతిమ కంటే అతనికే ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇలా మంచి ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సెలబ్రిటీలు వివాహం చేసుకోవడంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో వీరిద్దరూ కూడా వారి చర్యలు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వారి అభిమానులు ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అభిమానులు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…