Keerthi Bhat: బుల్లితెర సీరియల్స్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి నటి కీర్తి భట్ త్వరలోనే ఓ ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా త్వరలోనే ఈమె నటుడు విజయ్ కార్తీక్ తోట అనే వ్యక్తితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు ఈ క్రమంలోనే ఆదివారం ఈమె నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కీర్తి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కీర్తి పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఓ కార్యక్రమం ద్వారా వెల్లడించారు.
బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు కాబోయే వ్యక్తిని పరిచయం చేయడమే కాకుండా ఈ వేదికపైనే దండలు మార్చుకున్నారు. ఇక తాజాగా బుల్లితెర సెలబ్రిటీల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థపు కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ కీర్తి కాళ్లకు పట్టీలు పెట్టడమే కాకుండా తన చేతికి నిశ్చితార్థపు ఉంగరం తొడిగారు. అనంతరం కీర్తి సైతం ఉంగరం తొడిగి దండలు మార్చుకున్నారు. ఇలా నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరిద్దరిలాగే సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక కీర్తి జీవితంలో పెద్ద విషాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే రోడ్డు ప్రమాదంలో అందరినీ కోల్పోయిన కీర్తి ఇప్పుడు సరికొత్త కుటుంబంలోకి అడుగుపెడుతున్నటువంటి తరుణంలో అందరూ ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…