Keerthi Bhatt: కీర్తి భట్ పరిచయం అవసరం లేని పేరు పలు సినిమాలలో నటిగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమంలో చివరి వరకు హౌస్ లో కొనసాగుతూ ఎంతో మంది ఆ అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న మధురానగరిలో అనే సీరియల్ లో నటిస్తున్నారు.
ఇలా ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు మనకు తెలిసిందే. బుల్లితెర కార్యక్రమంలో భాగంగా నటుడు విజయ కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయినటువంటి కీర్తి ఈ ప్రమాదంలో తాను తల్లి అయ్యే అవకాశాన్ని కూడా కోల్పోయానని తెలిపారు.
నేను వీరి వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనని తెలిసినప్పటికీనన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ తనకు కాబోయే భర్త వారి కుటుంబం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికి కీర్తి బట్ తనకు కాబోయే భర్తతో కలిసి పలువురు బుల్లితెర సెలబ్రిటీలను తమ నిశ్చితార్థపు వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వీరి నిశ్చితార్థం ఆగస్టు 20వ తేదీ బేగంపేట్ లో ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది. ఇలా కీర్తి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒంటరి పోరాటం చేస్తూ నేడు తన జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్త తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…