Keerthy Suresh: కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈమె ఒకవైపు హీరోయిన్గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు కథ ప్రాధాన్యత ఉంటే హీరోలకు చెల్లెలు పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు.ఇలా కీర్తి సురేష్ ఇదివరకే సూపర్ స్టార్ రజనీకాంత్ కు అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాలో ఈమె రజనీకాంత్ కు చెల్లెలుగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈమె చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ఈమె చెల్లెలు పాత్రలో నటిస్తుందన్నగానే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి.
గతంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయని తెలుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇలా ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించడం వల్లే ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అయితే కొందరు మాత్రం కీర్తి సురేష్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.సినిమాలో నటీనటుల వల్ల సినిమాలు ఎప్పటికీ ఫ్లాప్ అవ్వని సినిమాలో కథ బలంగా ఉంటే సినిమా ఆటోమెటిగ్గా హిట్ అవుతుంది కానీ ఇలా సినిమా ఫ్లాప్ ను ఒకరి మీద తోసేయడం మంచిది కాదు అంటూ కొందరు కీర్తి సురేష్ పట్ల వస్తున్నటువంటి ఈ వార్తలపై విమర్శలు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…