ప్రస్తుతం సౌత్ లోనే మంచి పేరున్న హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు తమిళ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న హీరోయిన్ కాగా తొలి సినిమా నేను శైలజ తో ఆమెది గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. టాలీవుడ్ కి పరిచయమైన తొలి సినిమాతోనే కీర్తి సురేష్ సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత నేను లోకల్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టింది. ఈ రెండు హిట్ లతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది..ఇక ఈ సినిమా ల తర్వాత ఆమె ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. ఆ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఏకంగా నేషనల్ అవార్డు వచ్చేసరికి కీర్తి సురేష్ కోసం ప్రతి హీరో వెయిట్ చేశాడు.
ఆమెతో సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేయడం ఆమెకు పెద్ద మైనస్ గా మారాయని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మరింత మైనస్ గా మారాయి..
తాజగా సావిత్రి బయోపిక్ లాగే మరో హీరోయిన్ బయోపిక్ కి ఆమె ఒకే చెప్పినట్లు సమాచారం.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రావాల్సిన బయోపిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే త్వరలో మరో సీనియర్ నటీమణి జమున బయోపిక్ కూడా తెరపైకి రానున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఒక దర్శకుడు జమునతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.జమున, సావిత్రి అప్పట్లో మంచి స్నేహితులు కూడా. ఇక ప్రస్తుతం జమున బయోపిక్ కు సంబంధించిన చర్చలు మొదలయినట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఆమె పాత్రకు న్యాయం చేయగల నటిమణులు ఎవరని అనుకుంటున్న సమయంలో మహానటి చేసిన కీర్తి సురేష్ పేరు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…