Keerthy Suresh: నటిగా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు.తమిళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక మహానటి సినిమాతో ఏకంగా ఉత్తమ జాతీయ నటిగా అవార్డు కూడా అందుకున్నారు.
ఇలా ఎన్నో విభిన్న కథ చిత్రాలలోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనూ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ తాజాగా నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె తమిళంలో ఉదయనిది స్టాలిన్ తో కలిసి నటించిన మామన్నన్ సినిమాలో నటించారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో చెన్నైలో ఫ్రీ రిలీజ్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కీర్తి సురేష్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.పొలిటికల్ త్రిల్లర్ సినిమాగా రాబోతున్న ఈ సినిమా సక్సెస్ కావాలని ఈయన కోరుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించడానికి ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటూ ఆమె గురించి ప్రశంసలు కురిపించారు.
అదేవిధంగా కీర్తి సురేష్ గురించి కమల్ హాసన్ మాట్లాడుతూ కీర్తి గొప్ప నటి. ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కితాబిచ్చారు.ఇలా కమల్ హాసన్ వంటి ఒక గొప్ప నటుడు కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించడంతో కీర్తి సురేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…