దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేసి కరోనా మహమ్మారిని కట్టడి చేశాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపు ఇచ్చారు. ఈ క్రమంలోనే కేవలం రాత్రి సమయంలో మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కేరళ రాష్ట్రంలో మాత్రం మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పాజిటివ్ రేటు 10% ఉండటంతో కరుణ కేసులను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం మరికొన్ని రోజులపాటు లాక్ డౌన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 24, 25 వ తేదీలలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను మైక్రో కంటెంట్ జోన్లుగా విభజించాలని వీలయినంత వరకు కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు లేదని, వారాంతంలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి ఆదేశించారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…