Kevvu Karthik: మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం టీం లీడర్ గా కొనసాగుతున్నటువంటి కెవ్వు కార్తీక్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన బుల్లితెరపై కామెడీ షోలలో సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా సినిమా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.
తాజాగా బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్టూడెంట్ సర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇకపోతే కెవ్వు కార్తిక్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తనకు కాబోయే భార్యను పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో ఎక్కడా కూడా తన భార్య ఫేస్ రివిల్ చేయలేదు.
ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన రెండు రోజులకే కార్తీక్ మరోసారి తన భార్య ఫేస్ రివిల్ చేస్తూ షేర్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే తన జీవితంలోకి వస్తున్నందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అయింది. పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది.
కెవ్వు కార్తిక్ గురువారం సాయంత్రం హైదరాబాదులో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి జబర్దస్త్ కమెడియన్ల అందరూ కూడా హాజరయ్యారు. ఇక ఈ వివాహ వేడుకలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తన భార్యతో కలిసి హాజరయ్యారు ఈ క్రమంలోనే శ్రీను తన కార్తీక్ పెళ్లిలో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…