Featured

KGF 2 journey : కేజీఎఫ్ 2 లో గుడ్డివాడిగా నటించిన ముసలాయన.. ఆ అవకాశం ఎలా వచ్చిందో తెలుసా ?!

KGF 2 blind Oldman real cinema journey : ఇండియా మొత్తం ఇపుడు కేజీఎఫ్ గురించే మాట్లాడుకుంటోంది అంతలా సినిమా క్రేజ్ ప్రేక్షకులకు చేరువైంది. కేజీఎఫ్ సమయంలో ఏవిధమైన అంచనాలు లేకపోయినా మంచి హిట్ అందుకుని అసలైన పాన్ ఇండియా సినిమాగా అవతరించింది. ఇక ఈ సినిమాకు సీక్వేల్ వస్తుందని దర్శకులు ప్రకటించడంతో సినిమాపై ఇక అంచనాలు భారీగా పెరిగాయి.కరోనా వల్ల సినిమా రావడం ఆలస్యమైన రికార్డులు మాత్రం బాగానే బద్దలుకొడుతోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో రికార్డు కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ సినిమాలో నాటించిన నటులకు మంచి గుర్తింపు లభించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.

అంధుడిగా నటించిన ముసలాయన ఎవరంటే….

ఇక కేజీఎఫ్2 సినిమాలో అంధుడిగా నటించిన కృష్ణాజీ గారికి మంచి గుర్తింపునిచ్చింది కేజీఎఫ్ 2. అసలు ఈ తాత ఎవరు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే ఆరాలు మొదలయ్యాయి. ఈ తాత ఆంధ్రా -కర్ణాటక బోర్డర్ ప్రాంతానికి చెందిన వారు. చిన్నప్పటి నుండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు చూసి సినిమా రంగంలోకి వెళ్లాలని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అడిగి వేసారి సినిమా వాళ్ళకు బట్టలు కుట్టే తన మిత్రుడు సహాయంతో ప్యాంటులూ కుట్టే పనికి కుదిరి ప్యాంటు కు 8రూపాయలు సంపాదించే వాడు. బీమ్ వెంకటేష్ అనే హీరో మరియు ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడి అతని దగ్గర సినిమా మేనేజ్‌మెంట్ పనికి కుదిరాడు. ఇక ఆ తర్వాత కమలహాసన్ మేకప్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడి అతని దగ్గరా టచ్ అప్ బాయ్ గా చేసాడు.

శాంతారామ్‌ అనే డైరెక్టర్‌ దగ్గర అసిస్టంట్‌గా చేరి మొత్తం అన్ని పనులు చూసుకునే వారు. తర్వాత శంకర్‌నాగ్‌తో పరిచయం ఏర్పడడం, ఆయనతో పాటు స్టోరీ డిస్కషన్‌లకు వెళ్లడం తో ఓ రోజు శంకర్‌ నాగ్‌ కృష్ణాజీని తన దగ్గర పని చేయమని అడగడంతో ఆయన ఒప్పుకున్నారు . ఆ సాయంత్రమే 2వేల రూపాయల చెక్కు ఇచ్చారు. మొట్ట మొదటి సారి అంత పెద్ద మొత్తంలో డబ్బులు చూసిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కో డైరెక్టర్ గా శంకర్ నాగ్ తో పనిచేసే సమయంలో కేజీఎఫ్ ప్రొవిజనల్ మేనేజర్ కుమార్ కేజీఎఫ్ సినిమా కోసం అడుగగా ఆయన ఆసక్తి చూపలేదు కానీ కుమార్ గారే ఫోటో ను పంపారు. ఇక ఆ తరవాత ఆడిషన్స్ జరిగి స్క్రీన్ టెస్టు చేసాక ఏమి చెప్పకుండ పంపేసారు ఆ తరువాత మళ్ళీ మేకప్ అప్ చేసి టెస్టు చేసి పంపించేశారు. ఆ తర్వాతే కేజీఎఫ్ కు రమ్మని ఫోన్ చేసారు. ఇలా వద్దనుకున్న అవకాశం అదృష్టంగా వచ్చి మంచి గుర్తింపును ఇచ్చింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

54 minutes ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

59 minutes ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

1 hour ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

2 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

2 hours ago

లేడీ యాంకర్ వల్లే కష్టాలు.. యాంకర్ రవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరలో తన ప్రత్యేక శైలితో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ Anchor Ravi తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.…

2 hours ago