Featured

Ilayaraja: వివాదంలో మ్యూజిక్ మెస్ట్రో… మోడీని అంబేద్కర్ తో పోల్చిన ఇళయరాజా… మండిపడుతున్న నెటిజన్లు!

Ilayaraja: చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు మంచి సంగీతం అందించి మ్యూజిక్ మెస్ట్రో గా పేరు సంపాదించుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులో కూడా యువ సంగీతకారులతో కలిసి పని చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.ద్రవిడ వాదానికి పుట్టినిల్లయిన తమిళనాడులో పుట్టినా, కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కులపోరాటాలకు, అంబేద్కర్, పెరియార్ ఐడియాలజీకి దూరం ఉన్నటువంటి ఇళయరాజా ఎన్నో సార్లు పలు విమర్శలకు గురయ్యారు.

Ilayaraja: వివాదంలో మ్యూజిక్ మెస్ట్రో… మోడీని అంబేద్కర్ తో పోల్చిన ఇళయరాజా… మండిపడుతున్న నెటిజన్లు!

ఇదిలా ఉండగా తాజాగా ఇళయరాజా మరొక వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అంబేద్కర్ తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇళయరాజా రాసిన అంబేడ్కర్‌ అండ్‌ మోడీ:రీఫార్మర్స్‌ ఐడియాస్‌, పెర్ఫార్మెర్స్‌ ఇంప్లిమెంటేషన్‌’ అనే పుస్తకంలో రాసిన ముందు మాట ఈ వివాదానికి కారణమైంది.

Ilayaraja: వివాదంలో మ్యూజిక్ మెస్ట్రో… మోడీని అంబేద్కర్ తో పోల్చిన ఇళయరాజా… మండిపడుతున్న నెటిజన్లు!

ఈ క్రమంలోనే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలోని దళిత సంఘాల నాయకులు ఇళయరాజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు అంబేద్కర్ కు పోలిక ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బీజేపీ-హిందూత్వ ఐడియాలజీ అమలులో భాగంగా తీసుకొచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు వివాదాస్పద చట్టాలనూ ఇళయరాజా ప్రశంసించారు.

అంబేద్కర్ కు మోడీకి పోలిక ఏంటి…

నరేంద్ర మోడీ పేరుకు అగ్రవర్ణ కులమైన ఈబిసి కులంలో జన్మించారు. ఇలా అగ్రవర్ణ కులంలో పుట్టిన మోడీకి అంబేద్కర్ కు పోలిక ఏంటి అంటూ పలువురు ఇళయరాజా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా రాసిన పుస్తకంలో అంబేద్కర్ మోడీ ఇద్దరు కూడా సామాజిక బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడారు. వీరిద్దరూ కూడా సామాజిక అణచివేత దగ్గరుండి చూడటమే కాకుండా, ఇద్దరు పేదరికాన్ని అనుభవిస్తూ దేశం కోసం ఎన్నో కలలు కనీ వాటిని ఆచరణలో పెట్టడం కోసం ఎంతో కృషి చేశారని మోడీని అంబేద్కర్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు అంబేద్కర్ తో మోడీనీ పోల్చడం సరికాదంటూ పెద్ద ఎత్తున తనపై విమర్శలు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago