Ilayaraja: చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు మంచి సంగీతం అందించి మ్యూజిక్ మెస్ట్రో గా పేరు సంపాదించుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులో కూడా యువ సంగీతకారులతో కలిసి పని చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.ద్రవిడ వాదానికి పుట్టినిల్లయిన తమిళనాడులో పుట్టినా, కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కులపోరాటాలకు, అంబేద్కర్, పెరియార్ ఐడియాలజీకి దూరం ఉన్నటువంటి ఇళయరాజా ఎన్నో సార్లు పలు విమర్శలకు గురయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా ఇళయరాజా మరొక వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అంబేద్కర్ తో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇళయరాజా రాసిన అంబేడ్కర్ అండ్ మోడీ:రీఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మెర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే పుస్తకంలో రాసిన ముందు మాట ఈ వివాదానికి కారణమైంది.

ఈ క్రమంలోనే తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలోని దళిత సంఘాల నాయకులు ఇళయరాజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు అంబేద్కర్ కు పోలిక ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బీజేపీ-హిందూత్వ ఐడియాలజీ అమలులో భాగంగా తీసుకొచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు వివాదాస్పద చట్టాలనూ ఇళయరాజా ప్రశంసించారు.
అంబేద్కర్ కు మోడీకి పోలిక ఏంటి…
నరేంద్ర మోడీ పేరుకు అగ్రవర్ణ కులమైన ఈబిసి కులంలో జన్మించారు. ఇలా అగ్రవర్ణ కులంలో పుట్టిన మోడీకి అంబేద్కర్ కు పోలిక ఏంటి అంటూ పలువురు ఇళయరాజా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా రాసిన పుస్తకంలో అంబేద్కర్ మోడీ ఇద్దరు కూడా సామాజిక బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడారు. వీరిద్దరూ కూడా సామాజిక అణచివేత దగ్గరుండి చూడటమే కాకుండా, ఇద్దరు పేదరికాన్ని అనుభవిస్తూ దేశం కోసం ఎన్నో కలలు కనీ వాటిని ఆచరణలో పెట్టడం కోసం ఎంతో కృషి చేశారని మోడీని అంబేద్కర్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు అంబేద్కర్ తో మోడీనీ పోల్చడం సరికాదంటూ పెద్ద ఎత్తున తనపై విమర్శలు చేస్తున్నారు.































