Categories: FeaturedMovie News

అసలు KGF కధేంటి.? బంగారు గనులు ఎందుకు మూసి వేయబడ్డాయి.?

KGF‌ అనగానే ఎవరికైనా సరే ముందుగా గుర్తుకు వచ్చేది.. ఆ పేరుతో ఈమధ్యనే విడుదలైన మూవీ. ఆ సినిమాలో బంగారు మైన్లను చూపిస్తారు. కానీ వాస్తవానికి ఇప్పుడు మీరు చదవబోయేది ఆ మూవీ గురించి కాదు. కోలార్‌లో ఉన్న బంగారు గనుల గురించి. 19వ శతాబ్దం నుంచే అక్కడ బంగారం తవ్వకాలు మొదలుపెట్టారు. మన దేశానికి ఉన్న ముఖ్యమైన బంగారు గనిగా KGF‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) పేరు గాంచింది. అయితే అంతటి పేరున్న గనిని కేంద్రం ఎందుకు మూసివేసింది ? బంగారం తవ్వి తీయవచ్చు కదా ? అనేకదా మీ సందేహం.. అయితే చదవండి..

ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మైకేల్‌ 1804వ సంవత్సరంలో ప్రచురించబడిన ఓ 4 పేజీల ఆర్టికల్ లో కోలార్‌లో బంగారు నిక్షేపాలున్నాయ‌ని చ‌దివాడు దాంతో 1871లో ఆయన త‌న మ‌కాంను బెంగళూరుకు మార్చాడు. ఆ తరువాత కొంత కాలానికి కోలార్‌ గనుల్లో బంగారం తవ్వకాలు ప్రారంభించాడు. ఇలా ఈ విష‌యం తెల్సుకున్న బ్రిటీష్ ప్ర‌భుత్వం అక్క‌డ అభివృద్ది పేరుతో బంగారాన్ని కొల్ల‌గొట్టే ప్లాన్ వేసింది. అనుకున్న‌దే త‌డవుగా 1900వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం కోలార్‌లో కావేరి నదిపై జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించేందుకు మైసూర్‌ మహారాజుకు ఓ పిటిషన్ కూడా పంపించింది. దానికి ఆయన ఒప్పుకున్నారు. దీంతో వడి వడిగా పనులు జరిగి విద్యుత్‌ కేంద్రం ఏర్పాటైంది. మొత్తం 148 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన విద్యుత్‌ లైన్లు కలిగిన ప్రాంతంగా కోలార్‌ పేరుగాంచింది.

ఇక ఆ పవర్‌ ప్లాంట్‌ దేశంలోనే మొదటి పవర్‌ ప్లాంట్‌ కాగా.. ఆసియాలో రెండోది. కోలార్ ప్రాంతంలోకి విద్యుత్ రావ‌డంతో ప‌గ‌లు రాత్రి తేడా లేకుండా బంగారాన్ని త‌వ్వుకున్నారు. కోలార్‌ ప్రాంతమంతా బ్రిటిష్‌ వారితో నిండిపోయి చిన్నపాటి ఇంగ్లండ్‌ను తలపించేది. ఎటు చూసినా బంగ్లాలే కనిపించేవి. కానీ అక్కడి గనుల్లో ప‌నిచేసే భారతీయులు మాత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో దుర్భర పరిస్థితిలో నివాసం ఉండేవారు. 1956 అనంతరం కోలార్‌ బంగారు గనులు జాతీయం చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి. అప్పటి నుంచి 2001 వరకు ఆ గనులలో తవ్వకాలు కొనసాగాయి. మొత్తం భారత్‌లో ఉత్పత్తి అయ్యే బంగారంలో కేవలం ఆ గనుల నుంచే 95 శాతం వరకు బంగారం వచ్చేది.

కానీ 2001లో ఆ గనులను మూసేశారు. తరువాత అక్కడ గనులన్నీ భూగర్భ జలాలతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఆ గనులను ఓపెన్‌ చేసి బంగారం తవ్వాలని పలువురు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే కోలార్‌ గనుల్లో బంగారం నిల్వలు ఇంకా ఉన్నప్పటికీ.. ఆ బంగారాన్ని తవ్వి తీయాలంటే.. ఆ బంగారం కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందట. అందుకనే ఆ గనులను అప్పట్లో మూసేశారు. అప్పటి నుంచి అక్కడ తవ్వకాలను జరపడం లేదు. అలా 2001 నుంచి ఆ గనులు మూసే ఉన్నాయి. ఆ విధంగా కేజీఎఫ్‌ గనుల అధ్యాయం ముగిసింది..!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago