Categories: FeaturedMovie News

జయలలిత ను అసెంబ్లీ లో చీర లాగి అమవానిస్తే… శోభన్ బాబు చేసిన పనికి ప్రతి ఒక్కరు బాధ పడ్డారు.

జయలలిత… ఈవిడ గురించి తెలియని భారతీయుడు ఉండడు. దీనికి కారణం ఆమె తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం ఒక కారణమైతే, అంతకుముందు తన అందంతో, అభినయంతో తమిళంలో, తెలుగులో హీరోల సరసన అనేక సినిమాల్లో నటించి ఔరా అనిపించుకుంది. ఈవిడ ఫిబ్రవరి 24, 1948వ సంవత్సరంలో కర్ణాటకలోని మైసూరు జిల్లాలో జన్మించింది. వీరి తల్లిదండ్రులు అయిన జయరామ్, వీరవల్లి దంపతులకు పాండవపురం తాలూక మేలుకోటేలో జన్మించింది. జయలలిత తల్లి ఒక తమిళ బ్రాహ్మణ వంశానికి చెందిన వారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అయితే అది ఆమె అవ్వ గారి పేరు. అప్పట్లో బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టడం జరిగింది. అందులో రెండో పేరే మనకందరికీ తెలిసిన జయలలిత. ఈవిడ ఆ పేరును పాఠశాలలో చేరేటప్పుడు నమోదు చేసుకొని అప్పటి నుంచి అలా పిలవడం కొనసాగింది.

అయితే ఈవిడ తమ కుటుంబ పరిస్థితుల వలన తన తల్లి బలవంతంతో తన 15 వ ఏటనే సినీరంగంలోకి ప్రవేశించింది. తను నటించిన మొదటి చిత్రం కన్నడ లో చేసింది. అది చాలా పెద్ద హిట్ అయింది. అలాగే తెలుగులో మనుషులు మమతలు అనే సినిమా ద్వారా ఆమెను పెద్ద తార స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇక అంతే కాకుండా 1972వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కలైమామణి అనే పురస్కారంతో గౌరవించడం జరిగింది. ఈమె చనిపోయేంతవరకు అవివాహిత గానే ఉండిపోయింది. అయితే ఈవిడ పర్సనల్ జీవితంలో అనేక దాపరికాల మధ్య సంసార జీవితాన్ని పంచుకుంది. అయితే ఆ విషయాలు పూర్తిగా బయటి ప్రపంచానికి తెలియకపోయినా ఆ నోటా, ఈ నోటా ఏదో ఒక వార్త ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.

ఇక ఇలాంటి వార్తలు లోనే అందరికీ తెలిసినట్లుగానే తమిళ సూపర్ స్టార్ జిఎంఆర్, అటు తెలుగులో… ఇటు తమిళంలో హీరోగా నటించిన శోభన్ బాబు తో సహజీవనం చేశారని తెలిసిన సంగతి. అయితే అనుకోని పరిస్థితుల దృష్ట ఆవిడ రాజకీయాల వైపు వెళ్లడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎంజీఆర్ తో రాజకీయాల్లో చేరడంతో ఆవిడ కూడా ఆయనతోపాటు రాజకీయాల వైపు నడిచింది. ఇక ఇదే నేపథ్యంలో 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన కూడా జరిగింది. అయితే ఎమ్ జీ ఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ఆవిడే ప్రకటించుకుంది. ఇంతకంటే ముందు ఆవిడ రాజకీయ ప్రవేశం సందర్భాల్లో పార్లమెంటులో ఆవిడ తన పర్సనల్ జీవితాన్ని ఉద్దేశిస్తూ జరిగిన గొడవల్లో ఆమె చీరను లాగేశారు. దీనితో ఆమె అక్కడే కింద పడింది. అది అప్పట్లో పెద్ద సంచలనంకే దారితీసిందని చెప్పవచ్చు. ఇకపోతే అప్పట్లో తనతో పాటు సహజీవనం చేస్తున్న శోభన్ బాబు గారిని ఉద్దేశించి ఆవిడను అలా చేయడంతో ఆ విషయం తెలుసుకున్న శోభన్ బాబు తీవ్ర నిరాశకు గురయ్యారు. నావల్ల ఎప్పుడు ఎవరితో మాటలు అనిపించుకొని జయలలిత మాటలు అనిపించుకుంది అని శోభన్ బాబు తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago